రాజ‌స్థాన్‌పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం

-

షార్జాలో శుక్ర‌వారం జరిగిన ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ 2020 టోర్నీ 23వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయ‌ల్స్ పై ఢిల్లీ క్యాపిట‌ల్స్ ఘ‌న విజ‌యం సాధించింది. ఢిల్లీ విసిరిన 185 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఛేధించే క్ర‌మంలో రాజ‌స్థాన్ త‌డ‌బ‌డింది. ఆ జ‌ట్టు ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. కీల‌క‌మైన మ్యాచ్‌లో కూడా ఆ జ‌ట్టు బ్యాట్స్‌మెన్ నిర్ల‌క్ష్యంగా ఆడారు. దీంతో రాజ‌స్థాన్‌పై ఢిల్లీ 46 ప‌రుగుల తేడాతో గెలుపొందింది.

delhi won by 46 runs against rajasthan in ipl 2020 23rd match

మ్యాచ్‌లో రాజ‌స్థాన్ జ‌ట్టు టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోగా ఢిల్లీ బ్యాటింగ్ చేప‌ట్టింది. ఈ క్ర‌మంలో ఢిల్లీ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 184 ప‌రుగులు చేసింది. ఢిల్లీ బ్యాట్స్‌మెన్ల‌లో షిమ్రాన్ హిట్‌మైర్‌, స్టాయినిస్‌లు అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న చేశారు. 24 బంతుల్లోనే 1 ఫోర్‌, 5 సిక్స‌ర్ల‌తో హిట్‌మైర్ 45 ప‌రుగులు చేయ‌గా, స్టాయినిస్ 30 బంతుల్లో 4 సిక్స‌ర్ల‌తో 39 ప‌రుగులు చేశాడు. చివ‌ర్లో అక్ష‌ర్ ప‌టేల్ 8 బంతుల్లోనే 2 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 17 ప‌ర‌గులు చేసి జ‌ట్టుకు మ‌రిన్ని ప‌రుగులు జోడించాడు. ఈ క్ర‌మంలో ఢిల్లీ జ‌ట్టు రాజ‌స్థాన్ ఎదుట భారీ ల‌క్ష్యాన్ని ఉంచ‌గ‌లిగింది. ఇక రాజ‌స్థాన్ బౌల‌ర్ల‌లో జోఫ్రా ఆర్చ‌ర్ 3 వికెట్లు తీయ‌గా, కార్తిక్ త్యాగి, ఆండ్రూ టై, తెవాతియాలు త‌లా 1 వికెట్ ప‌డ‌గొట్టారు.

అనంత‌రం బ్యాటింగ్ చేప‌ట్టిన రాజ‌స్థాన్ ఏ ద‌శ‌లోనూ కోలుకోలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోతూ వ‌చ్చింది. దీంతో ఆ జ‌ట్టు 19.4 ఓవ‌ర్ల‌లో 138 ప‌రుగులు మాత్ర‌మే చేసి ఆలౌట్ అయింది. రాజ‌స్థాన్ బ్యాట్స్‌మెన్ల‌లో తెవాతియా, జైశ్వాల్‌, స్మిత్ మిన‌హా ఎవ‌రూ ఆక‌ట్టుకోలేదు. 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో తెవాతియా 38 ప‌రుగులు చేయ‌గా, జైశ్వాల్ 36 బంతుల్లో 1 ఫోర్‌, 2 సిక్సర్ల‌తో 34 ప‌రుగులు చేశాడు. అదేవిధంగా రాజ‌స్థాన్ కెప్టెన్ స్మిత్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స‌ర్‌తో 24 ప‌రుగులు చేశాడు. ఢిల్లీ బౌల‌ర్ల‌లో మ‌ళ్లీ ర‌బాడా విజృంభించాడు. 3.4 ఓవ‌ర్లు వేసిన ర‌బాడా 35 ప‌రుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. అలాగే ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, స్టాయినిస్‌లు చెరో వికెట్లు ప‌డ‌గొట్టారు. నోర్జె, అక్ష‌ర్ ప‌టేల్‌, హ‌ర్ష‌ల్ ప‌టేల్‌ల‌కు త‌లా 1 వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Latest news