బిగ్ బాస్: వాళ్ళు వీళ్ళుగా, వీళ్ళు వాళ్ళుగా ఫన్ కోసం ప్రయత్నం.. కానీ..

-

ప్రతీ ఆదివారం సండే ఫన్ డే అంటూ అటు కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులకి వినోదాన్ని అందిస్తుంటారు బిగ్ బాస్ యాజమాన్యం. కానీ ఈ సారెందుకో వాళ్ళు చేసిన ప్రయత్నమంతా బెడిసికొట్టిందనే చెప్పాలి. ఫన్ కోసం హౌస్ లో ఉన్న అబ్బాయిలని అమ్మాయిలుగా, అమ్మాయిలని అబ్బాయిలుగా వేషం మార్చుకుని రమ్మని చెప్పారు. హౌస్ లో ఆడవాళ్ళు, మగవాళ్ళు అన్న తారతమ్యాలు చూపిస్తున్న కారణంగా వారిద్దరూ వేరు వేరు కాదు అందరూ సమానమే అని చెప్పడానికి వాళ్లని వీళ్ళుగా, వీళ్లని వాళ్ళుగా చూపించామని నాగార్జున చెప్పుకొచ్చాడు.

కానీ దానివల్ల ఫన్ జనరేట్ అవుతుందన్న మరో కోణం ఉందని అందరికీ అర్థమైంది. ఐతే బిగ్ బస్ యాజమాన్యం ఆలోచించినట్టుగా అక్కడా కామెడీ జనరేట్ కాలేదు సరికదా ప్రేక్షకులని చిరాకు తెప్పించింది. ఆల్రెడీ వాళ్ళందరికీ ఏ పాటకి డాన్స్ చేయాలో, ఏ డైలాగ్ చెప్పాలో ముందే చెప్పినట్టుగా ప్రేక్షకులకి తెలిసిపోవడంతో అంతగా ఫన్ జెనరేట్ కాలేదనే చెప్పాలి. అదీగాక ఎవరి రూపాల్లోకి వారు మారిన తర్వాత కబడ్డీ ఆడించైనా సరే ఫన్ పుట్టిద్దామనుకున్నారు. అక్కడ కూడా కంటెస్టెంట్ల తీరు పెద్దగా ఎలివేట్ కాలేదు. ఇక్కడ నాగార్జున కూడా విసిగిపోయినట్లున్నాడు. అందుకే టక్కున గేమ్ ఆపేసి, నామినేషన్ లో ఉన్నవాళ్ల మీదకి మళ్ళాడు.

నామినేషన్లో ఉన్న కంటెస్టెంట్లని తమ తమ పాపులారిటీ ద్వారా ర్యాంక్ ఇచ్చుకోమని చెప్పి, మీరు అనుకుంటున్నట్టుగా బయట ర్యాంకుల్లేవు అని చెప్పడంతో మొదటి మూడు స్థానాల్లో ఉన్న అభిజిత్ , మెహబూబ్, లాస్య లకి వారి వారి పరిస్థితి ఏంటనేది అర్థం అయ్యింది. మొత్తానికి ఈ రోజు ఎపిసోడ్ లో ఫన్ కోసం ఎంత ప్రయత్నించినా వర్కౌట్ కాలేదనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news