బిగ్ బాస్: అప్పుడు కావాలన్న వారే ఇప్పుడు పంపించేయమంటున్నారు.

బిగ్ బాస్ సీజన్లో ఎప్పుడు లేని విధంగా ఈ సారి స్పెషల్ కంటెస్టెంట్ హౌస్ లోకి అడుగు పెట్టింది. ఆరు పదుల వయసు దాటిన యూట్యూబ్ స్టార్ గంగవ్వ హౌస్ లోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులు కూడా గంగవ్వ ఎంట్రీని బాగా రిసీవ్ చేసుకున్నారు. మొదటి వారం ఎలిమినేషన్లో ఉన్నా కూడా ఓట్లేసి సేవ్ చేసారు. ఐతే రెండవ వారంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హౌస్ లో గంగవ్వ ఉండలేకపోతుంది. తాళం వేసిన ఇంట్లో నేనుండలేకపోతున్నానని బిగ్ బాస్ కి విన్నవించుకుంది. అందరూ బాగా చూసుకుంటున్నా నేనుండనని, నన్ను పంపించేయని చెప్పుకుంది.

ఈ నేపథ్యంలో ఆమె ఆరోగ్యం కూడా సరిగా లేదు. గంగవ్వ ఉండనని చెబుతున్నా బిగ్ బాస్ మాత్రం కొన్ని రోజులు పోతే అలవాటు అవుతుందని అంటున్నాడు. ఇక్కడే ప్రేక్షకులు బిగ్ బాస్ పై కోపంగా ఉన్నారు. అవ్వ ఇంట్లో ఉంటే బానే ఉంటుంది కానీ, ఆమె బాధపడుతూ ఉండడం సరికాదనీ, ఆమె బాధని చూడలేకున్నాం పంపించివేయండని సోషల్ మీడియా ద్వారా కోరుకుంటున్నారు. అవ్వను ఇబ్బంది పెట్టకుండా తిరిగి పంపాలని కోరుకుంటున్నారు. మరి ఈ వారం బిగ్ బాస్ గంగవ్వని పంపించివేస్తాడేమో చూడాలి.