బిగ్ బాస్: ఈ వారం ఎలిమినేషన్.. అ.. ఆ.. లో ఎవరైనా..?

బిగ్ బాస్ రియాలిటీ షోలో ఈ వారం ఎలిమినేషన్ రానే వచ్చింది. నామినేషన్లో ఉన్న ఆరుగురిలో ఎవరో ఒకరు హౌస్ నుండి బయటకు వెళ్ళాల్సి ఉంటుంది. అమ్మ రాజశేఖర్, మోనాల్, అఖిల్, లాస్య, ఆరియానా, మెహబూబ్ లలో ఎవరో ఒకరు ఎలిమినేట్ అవబోతున్నారు. ఐతే తాజా సమాచారం ప్రకారం అమ్మ రాజశేఖర్, లేదా ఆరియానా.. ఇద్దరూ ఎలిమినేషన్ కి గట్టిగా పోటీ పడుతున్నారని అంటున్నారు.

ఆరియానాకి మొదట్లో ఫాలోయింగ్ బాగానే ఏర్పడినా, మెల్లమెల్లగా ఆమె గ్రాఫ్ తగ్గుతూ వచ్చింది. ఆరియానా, హౌస్ లో అంతగా పర్ ఫార్మ్ చేయట్లేదనే కంప్లైంట్ ఉంది. బద్దకస్తుల జంటగా ఆరియానా, అవినాష్ లని హౌస్ మేట్స్ గుర్తించడంతో కంటెస్టెంట్స్ లో కూడా ఈ అభిప్రాయం ఉందని అర్థం అవుతుంది. ఇక అమ్మ రాజశేఖర్, తను చెప్పేది మాత్రమే ఇతరులు వినాలి. ఇతరులు చెప్పేది నేను వినను అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు. నాగార్జున గారు చెప్పిన తర్వాత కూడా ఆయన పద్దతిలో పెద్దగా మార్పు వచ్చినట్టు కనబడలేదు.

సో వీటన్నింటిని వల్ల ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి.