బిగ్ బాస్ 4 ఎపిసోడ్ 4: అరియానాపై సీరియస్ అయిన గంగవ్వ… కారణమిదే?

-

ప్రతి బిగ్ బాస్ సీజన్ లాగే ఈ బిగ్ బాస్ సీజన్ లో కూడా కంటెస్టెంట్ల మధ్య గొడవలు మొదలయ్యాయి. సీక్రెట్ రూమ్ లో ఉన్న అరియానా గ్లోరీ, సొహైల్ ఎట్టకేలకు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టారు. అయితే అడుగు పెట్టిన వెంటనే తిండి పెట్టలేదనే కోపం, ఆవేశంతో వాళ్లిద్దరూ ఇంట్లో రచ్చరచ్చ చేశారు. అభిజిత్ సొహైల్ ను బిగ్ బాస్ లా ఎలా మాట్లాడతారని ప్రశ్నించగా ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది.

అనంతరం అరియానా గ్లోరీ ఇంటి సభ్యులలో ఎవరో ఒకరు తనకు ఫుడ్ తినిపించాలని పట్టుబట్టింది. అయితే ఇంటి సభ్యులు టాస్క్ లో భాగంగా అరియానా ఇలా చేస్తోందని భావించారు. అఖిల్ చివరకు అరియానాకు గోరుముద్దలు తినిపించడానికి సిద్ధం కాగా మిగతా కంటెస్టెంట్లు వద్దని వారించారు. కొంత సమయం అఖిల్ గోరుముద్దలు తినిపించగా ఆ తర్వాత కరాటే కళ్యాణి అరియానాకు తినిపించింది.

నోయల్ అరియానాకు ఎందుకు ఫుడ్ తినిపించావని అఖిల్ ను ప్రశ్నించగా తనకు ఎవరూ తినిపించలేదని అందువల్లే అరియానా అడగగానే తినిపించాలని అనిపించించిందని అఖిల్ చెప్పాడు. అరియానా ఎందుకు తినిపించమని అడుగుతుందో సొహైల్ కు కూడా అర్థం కాలేదు. సొహైల్ అరియానాను ఎందుకు తినిపించమన్నావని ప్రశ్నించగా ఆమె ఇది తన గేమ్ ప్లాన్ అని చెప్పింది.

ఆ తరువాత సొహైల్ ఇంటి సభ్యులకు వచ్చీరాగానే టాస్క్ లో భాగంగానే గొడవ పెట్టుకున్నానని చెప్పాడు. మరుసటి రోజు ఉదయం గంగవ్వ డంబెల్స్ తీసుకుని కేకలు వేయగా హారిక నన్ను ఎవరైనా తీసుకొనివెళ్లి నీ చీరలు ఇస్తేనే ఇంట్లోకి పంపిస్తాం అంటే చీరలిస్తావా…? అని గంగవ్వను ప్రశ్నించింది. దానికి గంగవ్వ పోతే పో, చీరలు మాత్రం ఇవ్వనని చెప్పింది. అనంతరం అరియానా గంగవ్వకు లిప్ స్టిక్ ఇవ్వగా గంగవ్వ అరియానాపై సీరియస్ అయింది. నాకు లిప్ స్టిక్ అవసరం లేదంటూ గట్టిగా అరిచింది.

Read more RELATED
Recommended to you

Latest news