ప్రధాని మోడీ కొత్త పథకం.. నేడే ప్రారంభం..!

-

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఇవాళ ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (PMMSY) ను డిజిట‌ల్ విధానం ద్వారా ప్రారంభించ‌నున్నారు. అలాగే రైతులకు నేరుగా ఉప‌యోగ‌ప‌డే స‌మాచారాన్ని అందించే బ్రీడ్ మెరుగుద‌ల మార్కెట్ ప్లేస్ పోర్ట‌ల్ ఈ -గోపాల యాప్‌ను కూడా మోదీ ప్రారంభించ‌నున్నారు. ఆత్మ‌నిర్భ‌ర్ ప్యాకేజ్‌ కింద 2020-21 నుంచి 2024-25 వ‌ర‌కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల‌లో 20,050 కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డి అంచ‌నాతో ఈ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్ట‌నున్నారు.

PMMSY కింద ఇంత పెట్టుబడి పెట్టడం ఇదే మొదటి సారి కావడం విశేషం. ఇందులో సుమారు 12,340 కోట్లను మెరైన్, ఇన్ ల్యాండ్ ఫిషరీస్, ఆక్వాకల్చర్ రంగాలకు కేటాయించారు. 7710కోట్ల రూపాయలను మత్స్య రంగంలో మౌళిక సదుపాయాల అభివృద్దికి కేటాయించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news