బిగ్ బాస్: నిజంగా ఇంత మోసం చేస్తారా? పాపం లాస్య..!

ఆదివారం ఎపిసొడ్ ఆటపాటలతో చాలా ఫన్నీగా సాగింది. నాగార్జున గారు ఆడించిన ఆటలు అటు కంటెస్టెంట్లతో పాటు ప్రేక్షకులని బాగా అలరించాయి. ఐతే ఆటలన్నీ పూర్తయ్యాక హౌస్ లో అసలైన గేమ్ మొదలైంది. ఆదివారం రాగానే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే అన్న విషయం తెలిసిందే. నామినేషన్లలో ఉన్న ఆరుగురిలో నుండి ఒక కంటెస్టెంట్ బయటకు వెళ్ళారు. గత రెండు రోజుల నుండి వస్తున్న వార్తలకి తగ్గట్టుగానే యాంకర్ లాస్య ఇంటిలో నుండి వెళ్ళిపోయింది.

ఈ వారం మొత్తంలో లాస్యపై నెగెటివిటీ తీవ్రంగా పెరిగింది. అందుకు తగ్గట్టుగానే హౌస్ నుండి బయటకు వచ్చేసింది. ఎలిమినేట్ అయిన లాస్య స్టేజి మీదకి వచ్చిన తర్వాత ఒక్కొక్కరి గురించి చెబుతూ తనకి ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరో తేల్చేసింది. అందరి గురించి చెబుతూ, అభిజిత్ నాకు ఇష్టమైన కంటెస్టెంట్ అని తెలిపింది. ఇంకా మాట్లాడుతూ, ఆరియానాకి కొన్ని సలహాలు ఇచ్చింది.

తనకి నచ్చిన విషయాన్ని చెబుతున్నప్పుడు, అవతలి వారికి అది నచ్చకపోతే వాళ్ళ ఆ విషయం చెప్పే అవకాశాన్ని ఇవ్వమని కోరింది. ఐతే ఇదంతా పక్కన పెడితే, బిగ్ బాస్ మొదలయినప్పటి నుండి కంటెస్టెంట్స్ అందరికీ వండిపెట్టింది. ఇన్ని రోజులుగా హౌస్ లో ఉన్న చాలామందికి వంటరాదని భావించిన లాస్య, వండిపెడుతూ వచ్చింది. కానీ లాస్య వెళ్ళిపోతున్నప్పుడు తేలిన విషయమేంటంటే, కంటెస్టెంట్స్ అందరూ వంట బాగా చేస్తారట.

అభిజిత్, సోహైల్, హారిక, ఆరియానా.. ఇలా అందరూ తమకి వంట చేయడం వచ్చినప్పటికీ ఎక్కడ వంట చేయమంటారో అన్న ఉద్దేశ్యంతో దాచుకుంటూ వచ్చారు. మొత్తానికి హౌస్ మేట్స్ భలే మోసం చేసారుగా..!