బిగ్ బాస్: మెహబూబ్ వెళ్ళకుండా బిగ్ బాసే కాపాడుతున్నాడా..?

-

సోమవారం నామినేషన్స్ లో మొత్తం తొమ్మిది మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు. ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి అవినాష్, సోహైల్, మెహబూబ్, అమ్మ రాజశేఖర్ మినహా మిగతా అందరూ నామినేట్ అయ్యారు. ఐతే నిజానికి మెహబూబ్ కూడా నామినేషన్స్ లో ఉండేవాడే. కానీ కెప్టెన్ అయిన సోహైల్ కి తన ప్రత్యేక అధికారాన్ని ఉపయోగించుకుని ఎవరో ఒకరిని సేవ్ చేయమని బిగ్ బాస్ ఆదేశించడంతో, సోహైల్ తడుముకోకుండా మెహబూబ్ అని చెప్పేసాడు.

ఈ లెక్కన చూస్తే బిగ్ బాసే మెహబూబ్ ని సేవ్ చేసాడేమో అనిపిస్తుంది. మెహబూబ్, సోహైల్ ల మధ్య ఉన్న స్నేహం వల్ల వారిద్దరూ ఒక్కటైపోయి హౌస్ మొత్తానికి వ్యతిరేకంగా తయారవుతున్నారు. దానివల్ల హౌస్ లో డ్రామా క్రియేట్ అవుతుంది. కాయిన్స్ టాస్ చూసుకున్నా, హోటల్ టాస్క్ చూసుకున్నా వారిద్దరే బాగా హైలైట్ అయ్యారు. సో.. మెహబూబ్ ని కాపాడలన్న ఉద్దేశ్యంతోనే సోహైల్ కి ప్రత్యేక అధికారం వాడుకోమని ఉంటాడని అందరూ అభిప్రాయపడుతున్నారు.

ప్రస్తుతం నామినేషన్స్ లో ఉన్నవారిలో కుమార్ సాయి ఒక్కరే కొద్దిగా వీక్ గా కనిపిస్తున్నారు. మరి ఈ సారి హౌస్ నుండి వెళ్లేది ఎవరో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news