బిగ్‌బాస్ తెలుగు సీజన్ 4 మంచి ఊపుతో దూసుకుపోతోంది. అయితే బిగ్‌బాస్ షోలో తెలుగు కంటే కూడా హిందీ, ఇంగ్లీష్ బాషలు ఉపయోగించడం కాస్త సగటు తెలుగు ప్రేక్షకులకు అంతగా నచ్చట్లేదు. అల్‌మిక్స్‌లాగా తెలుగు, హింది, ఇంగ్లీష్ వాడేస్తున్నా బాగానే ఉంది గానీ,, ఆ తమిళ తంబీల ఓవరాక్షనే కొద్దిగా ఎబ్బెట్టుగా ఉంది. బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ఆ తమిళ అంకుల్స్‌కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తుంది.
అమ్మ రాజశేఖర్, సూర్యకిరణ్‌ల ఓవరాక్షన్‌కు ప్రత్యేకంగా చూపెడుతున్నాడు. ఇక ఇప్పటికే ఎలిమినేషన్‌లో ఉన్న సూర్య కిరణ్‌కి ప్రేక్షకుల నుంచి ఆదరణ అంతం మాత్రంగానే ఉంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సూర్య కిరణ్‌కి వచ్చిన ఓట్లలో ఎక్కువ శాతం తమిళనాడు నుంచేనట. తమిళుల గురించి అందరికీ తెలిసిందే కదా వారు వాళ్ళ బాషకు ఇచ్చే విలువ. అలాగే ఇక్కడ తెలుగు బిగ్‌బాస్ పై తమిళ ఓట్లతో పెద్దఎత్తున దాడి చేస్తున్నారు. పాతికేళ్ల బాలా కుమారునిలా అమ్మ రాజశేఖర్ రెచ్చిపోతుంటే.. కంటెస్టంట్లపై సెటైర్లు వేస్తూ కిరికిరి పెడుతున్నాడు కిరికిరి సూర్య కిరణ్..
అంతా బాగానే ఉంది కానీ బిగ్‌బాస్ తెలుగు కంటే బిగ్‌బాస్ తమిళ్ అని పేరు మారిస్తే బాగుంటుందంటూ నెటింజన్స్ ట్రోల్ చేస్తున్నారు. హలో బిగ్‌బాస్ వింటున్నావా ఆ పేరేదో మార్చేసి హీరో రాజశేఖర్‌ను, సిద్ధార్థ్‌ను సెలెక్ట్ చేయండంటూ కౌంటర్లు వేస్తున్నారు. ఈ తమిళ పీడ తెలుగు వెండి తెరనే కాకుండా బుల్లితెరనూ వదలట్లేదు.
మరి ఈ విషయం హోస్ట్ కింగ్ నాగార్జున దాకా వెళ్లిందో లేదో మరి