ఓ రేంజ్‌లో ఉండ‌బోతున్న “బిగ్‌బాస్4″‌.. దేత్త‌డి పోచ‌మ్మ గుడి

-

బిగ్‌బాస్ సీజ‌న్ 4 ఓ రేంజ్‌లో ప్లాన్ చేస్తున్నారు షో నిర్వాహ‌కులు. గ‌త సీజ‌న్ల కంటే ఈ సీజ‌న్‌ను ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా అన్ని విష‌యాల్లో జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. ట్రెండింగ్ సెల‌బ్రిటీల‌ను కంటెస్టంట్స్‌గా తీసుకురాబోతున్నారు. కంటెస్టంట్స్ లిస్ట్ మామూలుగా లేదు… ఇప్ప‌టివ‌ర‌కు వ‌చ్చిన పేర్ల‌కు తోడు ఇప్పుడు మ‌రో ట్రెండింగ్ పేరు వ‌చ్చి చేరింది.

యూత్‌లో మంచి క్రేజ్ ఉన్న దేత్త‌డి హారిక‌ను హౌజ్‌లోకి తీసుకుంటున్న‌ట్లు తెలుస్తుంది. జియో పుణ్య‌మా అని యూత్ విప‌రీతంగా యూట్యూబ్, ఫేస్ బుక్ వాడ‌తున్నారు. ఇలా రోజులో గంట‌ల త‌ర‌బ‌డి సోష‌ల్ మీడియాకు అతుక్కుపోతున్నారు. వెర‌సి యూట్యూబ్ స్టార్స్ మ‌రింత పాపుల‌ర్ అయ్యారు. ఆ కోవ‌లేకే వ‌స్తుంది దేత్త‌డి హారిక‌. విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండ‌టం హారిక‌కు ప్ల‌స్ పాయింట్‌. బిగ్‌బాస్ ఫైన‌ల్ కి చేర‌గ‌లిగే స‌త్తా ఉంది ఈమెకు.

హారిక మాట‌ల‌తో ఆక‌ట్టు కోవ‌డంలో అంద‌రికంటే ఒక‌మెట్టు ముందే ఉంటుంద‌న‌డంలో సందేహంలేదు. ట్యాలెంట్‌, అందం, అభిన‌యం, డ్యాన్సింగ్‌, ఫ్యాన్ ఫాలోయింగ్ అన్నీ ఉన్నాయి. బిగ్‌బాస్ అంచ‌నాల‌ను మించి ఆక‌ట్టుకోగ‌ల‌దు. హారిక ఎంపిక బిగ్‌బాస్ నిర్వాహ‌కుల మంచి ఛాయిస్‌.

Read more RELATED
Recommended to you

Latest news