ఈరోజు కేంద్ర క్యాబినెట్ భేరీ కానుంది. ఉదయం 10.30 గంటలకు ప్రధాని నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర కేబినెట్ సమావేశం కానున్నట్టు సమాచారం అందుతోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసుల మీద ప్రధానంగా చర్చ జరగనుందని అంటున్నారు. అలానే అమృత్ సర్, ఇండోర్, రాంచీ, త్రిచీ, భుబనేశ్వర్, రాయపూర్ ఆమోదించనుంది కేంద్ర కేబినెట్.
తొలి దశ ప్రైవేటీకరణ కింద లఖ్‌నౌ, అహ్మదాబాద్, జయపుర, మంగళూరు, తిరువనంతపురం, గువహటిలలోని విమానాశ్రయాలను ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ) కింద అభివృద్ధి చేయడానికి ఫిబ్రవరి 2019లోనే అనుమతులు వచ్చాయి. ఆ తర్వాత సెప్టెంబరు 2019లో మిగిలిన విమానాశ్రయాలనూ ప్రైవేటీకరణ చేయాలని పౌర విమానాశ్రయ శాఖకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా సిఫారసు చేసింది. ఈ నిర్ణయానికి ఆమోద ముద్ర పడిన అనంతరం ఈ ఏడాదే బిడ్డింగ్ ప్రక్రియ మొదలవుతుంది.