మ‌రోసారి‌.. బిగ్‌బాస్4 హౌస్‌లోకి “తీన్మార్ యాంకర్”‌

-

బిగ్‌బాస్ హంగామా దాదాపుగా మొద‌లైన‌ట్లే క‌నిపిస్తుంది. సోష‌ల్ మీడియాలో బిగ్‌బాస్ తాలూకు ఛాయ‌లు క‌నిపిస్తున్నాయి. ఫ్యాన్ పేజీలు, ఆర్మీలు రెఢీ అవుతున్నాయి. ఇక విష‌యంలోకి వ‌స్తే బిగ్‌బాస్4 కంటెస్టెంట్స్ లిస్ట్‌లోకి కొత్త పేరు వ‌చ్చిచేరింది. ఆమె హెచ్ఎమ్‌టీవీ యాంకర్ సుజాత‌. సుజాతగా వీ6 తీన్మార్ వార్త‌లతో త‌న స‌త్తా చాటుకుంది. సుజాత హెచ్ఎమ్‌టీవీ వ‌చ్చే జోర్దార్ వార్త‌ల్లో యాంక‌రింగ్ చేస్తుంది.


సుజాత సొంత ఊరు వ‌రంగ‌ల్ లోని చెన్నారావు పేట మండ‌లం ఇప్ప‌ర ప‌ల్లి. ఆమె తండ్రి ఆర్టీసీ డ్రైవ‌ర్‌, తల్లి అంగన్ వాడీ టీచర్. చుదువు పూర్త‌వ‌గానే ఉద్యోంగం కోసం హైద‌రాబాద్‌కు వ‌చ్చిన సుజాత అనుకోకుండానే బుల్లి తెరపైకి వ‌చ్చింది. రామసీత సీరియల్స్ లో నటించిన సుజాత‌ సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలోనూ ఓ క్యారెక్టర్ చేసింది.

గ‌త సీజ‌న్లో శివ‌జ్యోతి బిగ్‌బాస్ 3 ‌లో పాతాళ గంగా పారించేసి మొత్తానికి షోకి బాగా ఉప‌యోగ‌ప‌డింది. చ‌లాకీగా క‌లుపుగోలుగా ఉంటుంద‌నే పేరు ఉన్న సుజాత అలియాస్ శృతి బిగ్‌బాస్ జ‌ర్నీ చూడాలంటే మ‌రికొన్ని రోజులు ఆగాల్సిందే మ‌రి..

Read more RELATED
Recommended to you

Latest news