Bigg Boss 5 Telugu: దిమ్మ‌తిరిగే రెమ్యూనేష‌న్ తీసుకున్న ప్రియ‌.. ఏడు వారాల‌కు త‌న ఖాతాలో ఎంత వేశారంటే.?

-

Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్ సీజన్ 5 బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు పుల్ మీల్స్ ఎంట‌ర్ టైన్ మెంట్ చేస్తూ ర‌స‌వ‌త్తరంగా సాగుతోంది. 19మంది కంటెస్టెంట్ల‌తో ప్రారంభ‌మైనా ఈ షోలో ఇప్ప‌టి వ‌రకూ.. వారానికి ఒక్కోక్క‌రూ చొప్పున ఏడుగురు కంటెస్టెంట్‌ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతున్నారు. తాజాగా ఏడో ఎలిమినేష‌న్లో సీనియర్‌ ఆర్టిస్ట్‌ ప్రియ కూడా హౌజ్‌ నుంచి ఎలిమినేట్ అయ్యింది. హౌజ్‌లో ఉన్నన్ని రోజులు తనదైన ఆటతీరుతో ఆకట్టుకున్న ప్రియ ఎట్టకేలకు ఎలిమినేట్‌ కావాల్సి వచ్చింది.

ప్రధానంగా త‌న కోప‌మే.. త‌న ఎలిమినేషన్ కార‌ణ‌మని చ‌ర్చ న‌డుస్తుంది. తొలి వారం నుంచి ఓటింగ్ లో టాప్ లో ఉన్న‌.. ఆమె ఏడో వారం చేసిన ర‌చ్చ మామూలుగా లేదు. త‌రుచు గొడవలకు దిగడమే ఆమెకు నెగిటివ్‌గా మారింది. ఇక ఏడో వారం ఆమె చేసినా గొడ‌వ మామూలుగా లేదు. స‌న్నీకి త‌న‌దైన శైలిలో వార్నింగ్ లు ఇచ్చి హౌస్ ను హీటెక్కించింది. సోషల్‌ మీడియాలో టాక్ టాఫిక్‌గా మారింది. ఫైన‌ల్ గా ఎలిమినేట్ కావాల్సి వ‌చ్చింది.

ఇదిలా ఉంటే.. ప్రియ రెమ్యూన‌రేష‌న్ పై సోష‌ల్ మీడియాలో ర‌చ్చ న‌డుస్తుంది. ఏడు వారాలు హౌజ్‌లో ఉన్న ప్రియ ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటుంద‌నే వార్త‌లు వెలువ‌డుతున్నాయి.

అటు సినిమాల్లో ఇటు సీరియళ్లలో న‌టించే ప్రియ ఎంతో మంది అభిమానుల‌ను సంపాదించుకున్న వారానికి ఎంత తీసుకుంది? ఏడు వారాల్లో ఎన్ని లక్షలు పోగు చేసింది? ఆమె అకౌంట్లో ఎంత ఆమౌంట్ వేసి ఉంటార‌నే ఆరా తీస్తున్నారు బిగ్ బాస్ ఫాలోవ‌ర్స్. ఇండస్ట్రీలో, సోషల్‌ మీడియాలో ఆమెకు ఉన్న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని బిగ్‌బాస్‌ నిర్వాహకులు ప్రియ‌కు ఒక్క వారానికే 1.5 లక్షల రూపాయలు ఇస్తున్నట్లు సమాచారం.

అంటే ఈ లెక్కన ప్రియ ఏడు వారాలకు పది లక్షల పైనే సంపాదించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ లో ఆమె చేసిన ఎంట‌ర్ టైన్ మెంట్ ను దృష్టిలో పెట్టుకుని ఆమెతో చేసుకున్న డీల్ కంటే.. ఎక్కువ మొత్తంలోనే ఇచ్చే ఆస్కారం ఉన్న‌ట్టు భావిస్తున్నారు నెటిజ‌న్లు. బిగ్ బాస్ టీఆర్పీ పెంచ‌డానికి అవసరమయ్యే కంటెంట్‌ కూడా ఇచ్చిందని కామెంట్లు చేస్తున్నారు.మరి తన రెమ్యునరేషన్‌పై వస్తోన్న వార్తల విషయంలో ప్రియ ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news