బిగ్ బాస్ సామ్రాట్ రెండవ వివాహం..

-

ఈ సీజన్ అంతా సినిమా వాళ్ళ పెళ్ళిళ్లే జరుగుతున్నాయి. తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక్కొక్కరుగా పెళ్ళిపీటలెక్కుతున్నారు. రానా నుండి మొదలుకుని, కాజల్ వరకూ అలా పెళ్ళి పీటలెక్కినవారే. తాజగా బిగ్ బాస్ కంటెస్టెంట్ సామ్రాట్ వివాహం చేసుకున్నాడు. బిగ్ బాస్ రెండవ సీజన్లో అందరి దృష్టిని ఆకర్షించిన సామ్రాట్, శ్రీ లిఖిత అనే అమ్మాయిని తన జీవితంలోకి ఆహ్వానించాడు. ఈ వివాహ వేడుక కర్ణాటకలో జరిగింది.

ఇరువురు కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జరిగిన శుభ వేడుకకి బిగ్ బాస్ రెండవ సీజన్లో కంటెస్టెంట్లుగా వచ్చిన తనీష్, దీప్తి సునైన హాజరయ్యారు. కరోనా నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వివాహ వేడుక జరిగిందట. గతంలో హర్షిత అనే అమ్మాయిని వివాహం చేసుకున్న సామ్రాట్, ఆ తర్వాత కొంత కాలానికి ఆమెతో తన బంధాన్ని విడదీసుకున్నాడు. ప్రస్తుతం శ్రీ లిఖితతో రెండవ వివాహం చేసుకున్నాడు. బిగ్ బాస్ తో పాపులర్ అయిన సామ్రాట్, సినిమాల్లోనూ కనిపించాడు.

Read more RELATED
Recommended to you

Latest news