Bigg Boss 5 Telugu: డేంజర్ జోన్ లో ఆ ముగ్గురు.. వీరిలో ఒక‌రు అవుట్!

-

Bigg Boss 5 Telugu: బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను అమితంగా ఆక‌ట్టుకుంటున్న బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్. చివ‌రి ద‌శ‌కు చేరుకున్న కొద్దీ గేమ్ మరింత ర‌స‌వ‌త్త‌రంగా మారుతుంది. ఈ వారం నామినేష‌న్ల ప‌ర్వం చాలా ఆస‌క్తిక‌రంగా మారింది. ఈ సారి కెప్టెన్ ర‌వి త‌ప్ప‌.. మిగిత కంటెస్టెంట్లంద‌రూ నామినేష‌న్లో నిలిచారు.
ఈ వారం ఏకంగా ఎనిమిది మంది కంటెస్టెంట్స్ నామినేషన్లలోకి రావడంతో ఈ సారి డేంజర్ జోన్లో ఎవరెవరు ఉన్నారు? ఎవ‌రు ఎలిమినేట్ కాబోతున్నార‌నే చ‌ర్చ సోషల్ మీడియాలో చాలా ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. నామినేషన్ల జాబితా ను ప‌రిశీలిస్తే.. సిరి, షణ్ముఖ్, అనీ మాస్టర్, కాజల్, శ్రీరామ చంద్ర, సన్నీ, మానస్, ప్రియాంక ఉన్నారు.

‘బిగ్ బాస్ తెలుగు 5’ ఫాలోవర్స్, సోష‌ల్ మీడియా ట్రెండ్‌లు, సోషల్ మీడియా పోస్టులు, గేమ్ లో ప‌ర్ఫార్మెన్స్ బ‌ట్టి చూస్తే.. ఈవారం ముగ్గురు కంటెస్టెంట్లు డేంజర్ జోన్ లో ఉన్న‌ట్టు తెలుస్తోంది. అనీ మాస్ట‌ర్, సిరి, ప్రియాంక ల్లో ఎవ‌రో ఒక‌రూ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందని సోష‌ల్ మీడియా టాక్.

గ‌త వారం ఎలిమినేష‌న్ నుంచి కాజ‌ల్ తుదిలో త‌ప్పించుకున్నది. ఒక వేళ జెస్సీని అనారోగ్యం కార‌ణంగా హౌస్ నుంచి త‌ప్పించారు. కాబట్టి కాజ‌ల్ సేఫ్ అయింది. లేక‌పోతే.. హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయేది. గ‌త‌వారంతో పోల్చితే.. ఈ వారం కాజ‌ల్ గ్రాఫ్ ఆకస్మాత్తుగా పెరిగింది. ఇటీవలి ఎపిసోడ్స్‌లో
కాజ‌ల్ ప‌ర్ఫార్మెన్స్ బాగుంది. ఇప్ప‌టికే ప్రేక్షకుల నుండి భారీ సంఖ్య‌లో ఓట్ల‌ను కైవ‌సం చేసుకుంది.

ఇక‌ సన్నీ షో మిస్ట‌ర్ ఫ‌ర్పెక్ట్ గా ఆల్ రౌండ్ ప‌ర్పార్మెన్స్ తో అద‌ర‌గొడుతున్నాడు. ఇక షణ్ముఖ్, శ్రీరామ చంద్ర, మానస్ స్ట్రాంగ్ కంటెస్టెంట్లు, సోష‌ల్ మీడియాలో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఓటింగ్ లో ఎక్కువ ఓట్ల‌ను కైవ‌సం చేసుకుంటూ టాప్ లో దూసుక‌పోతున్నారు. ఓ రెండు వారాల పాటు వారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వీరే టాప్ కంటెస్టెంట్లో ఉంటార‌న్న‌డంతో ఎలాంటి సందేహం లేదు.

ఇక మిగిలింది సిరి. ఇటీవల ఎపిసోడ్స్ లో సిరి ప్రవర్తన చాలా వింత‌గా ఉంది. ఆమె ప్ర‌వ‌ర్తించే తీరుపై సోష‌ల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోలింగ్ వ‌ర్షం కురుస్తుంది. ఆమెపై నెగెటివ్ ఒపీనియన్ వచ్చేసింది. ఇక అనీ మాస్టర్ విచిత్రం చేష్టాలు, వెక్కిరింపులు నెగెటివిటీని ముఠా కట్టుకుంది.
మిగిలింది ప్రియాంక సింగ్ (పింకీ). ఆమె మాన‌స్ పై దృష్టి పెట్ట‌డం త‌ప్ప గేమ్ పై ఏ మాత్రం దృష్టి సారించ‌డం లేద‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తున్నాయి. ఇతర పోటీదారుల కోసం గేమ్ ఆడ‌టం లేదు. ఈ వారం ఎవ‌రూ ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే.. ఆదివారం వ‌ర‌కూ వేచి ఉండాలి.

Read more RELATED
Recommended to you

Latest news