బిగ్ బాస్ హోస్ట్ కి భారీ దెబ్బ పడిందిగా..!!

-

బాలీవుడ్ లో బిగ్ బాస్ -16 ప్రస్తుతం ప్రారంభం కానుంది. ఈ బిగ్ బాస్ అక్టోబర్ ఒకటవ తేదీన స్ట్రీమింగ్ అయ్యేందుకు సర్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే సీజన్ కు సల్మాన్ ఖాన్ పారితోషకం విషయం మరొకసారి చర్చనీయాంశంగా మారుతోంది. సల్మాన్ ఖాన్ గతంలో ఒక్కో సీజన్ కి రూ.1000 కోట్ల రూపాయలు తీసుకుంటాడని ప్రచారం ఎక్కువగా జరిగింది. కానీ ఇది వాస్తవం కాదని సల్మాన్ ఖాన్ కు గత సీజన్ కంటే ఈసారి తక్కువ పారితోషకం చెల్లించబోతున్నట్లు బాలీవుడ్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.

సల్మాన్ ఖాన్ దాదాపుగా బిగ్ బాస్ మొదలైన 4 వ సీజన్ నుంచి ఇప్పటివరకు హోస్ట్ గా వ్యవహరిస్తూనే ఉన్నారు. ఇక బిగ్ బాస్ -16 కి కూడా హోస్ట్ గా రాబోతున్నట్లు కొన్ని ప్రోమోలు కూడా విడుదలయ్యాయి. కలర్స్ టీవీలో ఈ బిగ్ బాస్ స్ట్రీమింగ్ కు సిద్ధంగా ఉంది. రియాల్టీ షో లో ఎవరు ఉంటారు అనే వార్తలపై ఇప్పటికి ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈసారి రేసులో ఉండే పోటీ దారులే కాకుండా సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ విషయంలో కూడా నిలుస్తోంది బిగ్ బాస్-16.

ఈ సంవత్సరం సల్మాన్ ఖాన్ షో కోసం రూ.1000 కోట్లు తీసుకుంటున్నాడని వార్తలు రావడం జరుగుతున్నాయి అయితే ఇదంతా వాస్తవం కాదన్నట్లుగా తెలుస్తోంది. బిగ్ బాస్-15 గత సీజన్ లో సల్మాన్ ఖాన్ రూ.350 కోట్లు తీసుకున్నట్లుగా వార్తలు వినిపించాయి. అయితే ఇదే నిజమైతే ఈ సంవత్సరం అంతకంటే తక్కువగా.. అంటే రూ.280 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకునే అవకాశం ఉన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుచేత అంటే ఈ బిగ్ బాస్ పైన కూడా స్పాన్సర్లు పెద్దగా ఆసక్తి చూపించకపోవడంతో ఇలా రెమ్యూనరేషన్ విషయంలో కోతలు పడుతున్నట్లు సమాచారం. మరి ఈ విషయంపై అధికారికంగా ఇంకా ప్రకటన వెలుబడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news