Bigg Boss 5 Telugu: కాజల్ ను సేఫ్ చేయ‌డానికి బిగ్ బాస్ ట్విస్ట్ ఇదేనా?

-

Bigg Boss 5 Telugu: తెలుగు ప్రేక్ష‌కుల‌కు పుల్ మీల్స్ లాంటి ఎంట‌ర్ టైన్ మెంట్ అందిస్తున్నబిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజ‌న్ 5. ఈ షోలో ఎవ‌రూ ఊహించని ట్విస్టులు ఇస్తూ.. బుల్లితెర ప్రేక్ష‌కుల‌ను టీవీల ముందు క‌ట్టేస్తుంది. ఎప్ప‌టి లాగానే.. ప్రతివారం బిగ్ బాస్ హౌస్ నుంచి ఒకరు బ్యాగ్ సర్దేస్తుంటారు. అయితే ఈ వారం ఇంటి నుంచి ఎవరు బ‌య‌ట‌కు వెళ్లిపోతున్నార‌నేది సస్పెన్స్ కొన‌సాగుతుంది.

ఇక‌, ఈ వారం నామినేష‌న్స్ లో సిరి, సన్నీ, మానస్, రవి, కాజల్ ఉన్న విష‌యం తెలిసిందే. తొలుత సిరిని తీసుకుంటే.. ఈమె ఎట్టి ప‌రిస్థితిలో బ‌య‌ట‌కు పంపే ఛాన్స్ లేదు. ఆమె ఓటింగ్ లో టాప్ ఫ్లేస్ లో ఉంది. పైగా షణ్ముఖ్ నామినేషన్స్‌లో లేడు. కాబట్టి అతని ఓట్లు ఈమెకే ప‌డిన‌ట్టు తెలుస్తుంది. షణ్ముఖ్‌తో క‌లిసి గేమ్ ఆడితే.. సేఫ్ అని ప‌స్ట్ నుంచి ప‌క్కా ప్ర‌ణాళికతో ముందుకెళ్తుంది. ఇక మిగిలింది రవి, మానస్, సన్నీలు. వీరు హై ఓటింగ్‌లో టాప్ లో ఉన్నారు. ఈ సారి సన్నీ అందరికంటే ఓటింగ్‌తో
టాప్‌లో నిలిచిన‌ట్టు తెలుస్తుంది. ఆ త‌రువాత‌… ర‌వి, మాన‌స్ లు ఉన్నారు. వీరు ముగ్గురు టాప్ 5 కంటెస్టెంట్లో నిలుస్తార‌ని భావిస్తున్నారు.

ఇక మిగిలింది కాజ‌ల్. వివిధ స‌ర్వేలు, నెట్టింటి వార్త‌ల ప్ర‌కారం.. బిగ్ బాస్ హౌస్ నుంచి ఈవారం ఎలిమినేట్ అయ్యేది కాజల్ అని తెలుస్తుంది. ఆమె త‌ప్పించ‌డం త‌ప్ప మ‌రో ఆప్ష‌న్ లేదు.
ఆమెకు ఓటు ప‌డే ప‌రిస్థితి అస‌లు క‌నిపించ‌లేదు. కాజ‌ల్ చాలా స్ట్రాంగ్ ప్లేయర్. త‌న‌కంటే.. వీక్ ప్లేయ‌ర్స్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న‌ప్ప‌టికీ ఈవారం ఆమె నామినేష‌న్లో నిల‌వ‌డంతో.. తప్పని పరిస్థితిలో కాజ‌ల్ ఎలిమినేట్ కాక త‌ప్ప‌డం లేదు. ఎలాగైనా.. కాజ‌ల్ త‌ప్పించాలనే ప్లాన్ తోనే కాజ‌ల్ ను నామినేష‌న్లో ఇరికించిన‌ట్టు తెలుస్తోంది. ఓ వేళ నామినేష‌న్లో మానస్ గానీ, సన్నీ గానీ ఏ ఒక్క‌రూ లేక‌పోయినా కాజల్‌కి ఓట్లు పడేవి. కాజల్‌కి ఎలిమినేషన్ గండం గట్టెకేది.

అయితే.. ఈ వారం ఎలిమినేష‌న్ల నుంచి త‌ప్పించుకోవాలంటే.. కాజ‌ల్ ఒక్కే ఒక్క మార్గముంది. అది జెస్సీ ద్వారా.. అది ఎలా అనుకుంటున్నారా? ఈ వారం ఎలిమినేషన్ లో బిగ్ బాస్ పెద్ద ట్విస్టు ఇచ్చేలా క‌నిపిస్తున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న జెస్సీని హౌస్ నుంచి సీక్రెట్ రూంకు పంపించిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో జెస్సీని సీక్రెట్ రూంలో పెట్టి మరీ ట్రిట్ మెంట్ అందిస్తున్నారు. గ‌త ఎపిసోడ్‌లో డాక్టర్లు జెస్సీని మరోసారి పరీక్షించి.. మెరుగైన వైద్యం అందించాల్సిన అవ‌స‌ర‌ముంద‌ని చెప్ప‌క‌నే చెప్పేశారు.

దీని బ‌ట్టి చూస్తే.. జేస్సీని కావాల‌ని వీకెండ్ వ‌ర‌కూ గేమ్ లో ఉంచిన‌ట్టు తెలుస్తోంది. నేడు అత‌న్ని మెరుగైన వైద్యం కోసం.. బ‌య‌ట‌కు పంపించనున్నార‌ని టాక్. ఇలా జెస్సీ ని హౌస్ నుంచి పంపించ‌డం ద్వారా ఎలిమినేషన్స్‌ని ఎత్తివేయాలిని స్క్రీప్ట్ ప్రిపేర్ చేసిన‌ట్టు తెలుస్తోంది. త‌ద్వారాకాజల్ సేవ్ అయినట్టు టాక్. నాటకీయ పరిణామాల మధ్య మానస్-కాజల్‌లను ఎలిమినేషన్స్‌లో చివరి వరకూ ఉంచి.. చివర్లో నో ఎలిమినేషన్ ట్విస్ట్ ఇచ్చారట నాగార్జున.

Read more RELATED
Recommended to you

Latest news