విశాఖ ప్రేమోన్మాది కేసులో సంచ‌ల‌నాలు..ప‌క్కా ప్లాన్ చేసి..!

విశాఖ ప్రేమోన్మాది కేసులో సంచ‌ల‌నాలు వెలుగులోకి వ‌చ్చాయి. ప‌థ‌కం ప్ర‌కార‌మే హర్షవర్ధన్ దాడి చేసినట్లు పోలీసులు నిర్దారించారు. పంజాబ్ లో యువతీ యువకుడు క‌లిసి చ‌దువుకున్నారు. ఇరువురు హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తున్నారు. కోవిడ్ నేపథ్యంలో ఆన్లైన్ లో వర్క్ ఫ్రమ్ హోమ్ లో ఉన్నారు. కాగా తనను ప్రేమించాలని పలు మార్లు యువ‌తిని హర్ష వర్ధన్ వేధించిన‌ట్టు పోలీసులు నిర్ధారించారు. ఈ క్ర‌మంలో మూడు రోజుల క్రితం హర్ష వర్ధన్ విశాఖ‌కు చేరుకున్నాడు. లాడ్జి లో ఉన్నాను నీతో యువతిని వేధింపుల‌కు గురిచేశాడు.

vishaka petrol attack case update

రాకపోతే కుటుంబ సభ్యులను అంతమోందిస్తానంటూ బెదిరింపులకు పాల్ప‌డ్డాడు. చేసేదేం లేక యువతి లాడ్జికి వెళ్లిన‌ట్టు తెలుస్తోంది. ఇరువురి మధ్య చోటు చేసుకున్న వాగ్వాదంతో ప్లాన్ ప్రకారం వెంట తెచ్చిన పెట్రోల్ పోసి లైటర్ తో ఉన్మాది నిప్పంటించాడు. ఈ క్రమంలోనే ఉన్మాది కి కూడా మంట‌లు అంటుకున్నాయి. ప్ర‌స్తుతం 60 శాతం కాలిన గాయాలతో ఇరువురు చికిత్స పొందుతున్నారు. ఇరువురు స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేసుకున్నారు. ప్రస్తుతం యువకుడి పరిస్థితి విషమంగా ఉండ‌గా యువతి పరిస్థితి అత్యంత విషమంగా ఉంద‌ని చెబుతున్నారు.