Bigg Boss 5 Telugu: హానీ మూనీకి వెళ్లినా మాన‌స్- పింకీ.. బిగ్ బాస్ హోట‌ల్ లో హంగామా!

-

Bigg Boss 5 Telugu: బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు 5 చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఈ క్ర‌మంలో గేమ్ ను మరింత ర‌స‌వ‌త్త‌రంగా మార్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తున్నారు. జేస్సీని బిగ్ బాస్ ఇంట్లో నుంచి పంపించిన‌ట్టే పంపించి.. సీక్రెట్ రూంలో ఉంచారు బిస్ బాస్. జెస్సీ విష‌యంలో ఫైన‌ల్ గా ఎదో ట్విస్టు ఇస్తాడ‌నే భావిస్తున్నారు బిస్ బాస్ ల‌వ‌ర్స్. అందుకే క్వారెంటైన్ డ్రామా ఆడుతున్నాడ‌ని భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే.. బుధ‌వారం బిగ్ బాస్ షో చాలా ఫ‌న్నీగా సాగింది. కెప్టెన్సీ టాస్కులో భాగంగా.. బీబీ హోటల్‌ అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ఇచ్చాడు. ఈ టాస్క్లో శ్రీరామ్, షణ్ముఖ్ హోటల్ స్టాఫ్‌గా, చెఫ్స్, వెయిటర్, మేనేజర్, రిసెప్షనిస్ట్‌గా అనీ మాస్టర్, ఉద్యోగిగా యాంకర్ రవి, మానస్, ప్రియాంక లు
హానీమూన్‌కు వచ్చిన జంటగా, కాజల్ హోటల్‌ ఓనర్‌కు స్నేహితురాలిగా, తొలిసారి ఫైవ్ స్టార్ హోటల్‌కు వచ్చిన కస్టమర్‌గా సన్నీ, డాన్ కూతురుగా సిరి న‌టించాల్సి ఉంటుంది.

హోటల్‌కు వచ్చి అతిథులను సంతృప్తి పరిచేలా హోటల్ స్టాఫ్ సేవలు అందించాలి. అతిథులను మెప్పించి వారి నుంచి టిప్స్ పొందేలా వ్యవహరించాలి. ఎవరైతే ఎక్కువ టిప్స్ సొంతం చేసుకొంటారో వారు కెప్టెన్సీ పోటీదారులుగా ఎంపిక అవుతారు అని బిగ్‌బాస్ రూల్. ఈ టాస్కులో తొలిసారి పల్లెటూరి అబ్బాయి ఫైవ్ స్టార్ హోటల్‌కి వ‌స్తే ఎలా ఉంటుందో పాత్ర‌లో సన్నీ జీవించి.. నానా హంగామా సృష్టించాడు. హ‌నీతో సన్నీ చేసిన ఫన్ మూమెంట్స్ చాలా నవ్వించాయి.

గేమ్‌లో భాగంగా టిప్స్ అడిగితే.. త‌న‌దైన పంచ్ మార్క్ డైలాగుల‌తో రెచ్చిపోయాడు వీజే స‌న్నీ.
పొద్దున్నే వాము వాటర్ తాగండి.. ఉదయం మంచిగా మోషన్ అవుతుంది.. ఇదే నా టిప్ అంటూ క‌ప్పుబ్బ న‌వ్వించారు. ఈ క్ర‌మంలో ఆనీ మాస్ట‌ర్ కూడా రెచ్చిపోయింది. తెలంగాణ యాసాలో నీకు ఎవరైనా చెప్పారా? నీ ముఖం పిల్లిలా ఉంటుంది అంటూ స‌న్నీని ఆడుకుంది.

ఇక ట్కాసులోకి హానీమూన్‌కు వచ్చిన జంటగా ప్రియాంక, మానస్ ఎంట్రీతో ఇవ్వ‌డంతో మరింత కామెడీ జ‌న‌రేట్ అయ్యింది. ప్రియాంకతో వీజే సన్నీ చిలిపిగా ప్రవర్తించడం ఆకట్టుకొన్నది. మానస్ పక్కనే ఉన్నా.. ప్రియాంకకు లైన్ వేయ‌డం. ఏదో ర‌కంగా తాకడం, ఓ ద‌శ‌లో ప్రియాంక‌ను హ‌గ్ చేసుకోవడానికి టై చేయ‌డం. ఆమెతో జాగ్రత్తగా ఉండు. చాలా డేంజర్ అంటూ మానస్‌కు వీజే సన్నీ హెచ్చరించడం. ఈ సీన్లల‌న్నీ ఈ షోకే హైలెట్ గా నిలిచాయి.

Read more RELATED
Recommended to you

Latest news