తెలుగు బుల్లితెరపై ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభమైన రియాలిటీ షో బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బిగ్ బాస్ సీజన్ వన్ కి హోస్టుగా ఎన్టీఆర్ వ్యవహరించారు. అంతేకాదు మొదటిసారి సినీ ఇండస్ట్రీ నుంచి బుల్లితెరపై ఇదే కార్యక్రమం ద్వారా తన ఎంట్రీని మొదలుపెట్టారు ఎన్టీఆర్. ఈ షో విపరీతంగా ఇమేజ్ ను సొంతం చేసుకున్న తర్వాత ఆయన మీలో ఎవరు కోటీశ్వరులు అనే కార్యక్రమానికి కూడా హోస్ట్ గా వ్యవహరించారు. ఇక ప్రస్తుతం సినిమాలలో బిజీగా ఉన్న ఎన్టీఆర్ కి సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక బిగ్ బాస్ సీజన్ వన్ లో హోస్ట్ గా పనిచేస్తున్నప్పుడు ఎన్టీఆర్ ఒక హీరో కోసం రూ.25 లక్షలు పోగొట్టుకున్నారు అనే వార్త వైరల్ అవుతోంది. ఇక ఇందులో ఎంత నిజం ఉంది అనే విషయాన్ని ప్రముఖ కమెడియన్ ధన్ రాజ్ క్లారిటీ ఇచ్చారు.
.
హౌస్ నుంచి సంపూర్ణేష్ బాబును ఇంటికి పంపించడానికి ఎన్టీఆర్ బిగ్ బాస్ నిర్వహకులను అడగగా.. వారు 25 లక్షల రూపాయలు ఇస్తేనే బయటకు పంపిస్తామని చెప్పారు.. అయితే తాను మొదటిసారి హోస్ట్ గా చేస్తున్న కార్యక్రమాన్ని ఇలా చేయడం మంచి పద్ధతి కాదు అని నిర్వహకులకు చెప్పారట ఎన్టీఆర్. కానీ ఒకవేళ హీరో సంపూర్ణేష్ బాబు అంత కట్టలేని పరిస్థితిలో తానే ఆ డబ్బు చెల్లిస్తానని హామీ ఇచ్చారట. ఇక అలా సంపూర్ణేష్ బాబు కోసం 25 లక్షల రూపాయలను చెల్లిస్తానని తెలిపారు కానీ నిర్వహకులు అర్థం చేసుకొని ఆయనను పంపించేశారు అంటూ ధనరాజు క్లారిటీ ఇచ్చారు.