బిగ్ బాస్: మేనేజ్మెంట్ కోటాకి బలికాబోతున్న సూపర్ కంటెస్టెంట్..!

-

బిగ్ బాస్ సీజన్ 6 కు చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం హౌస్ లో 8 మంది మాత్రమే టైటిల్ కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నారు. అయితే 13వ వారానికి సంబంధించి నామినేషన్స్ లో ఆరుగురు ఉన్నారు. ఇనయ కెప్టెన్ కావడం వల్ల ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పుకోగా.. శ్రీహాన్ కూడా ఎవరు నామినేట్ చేయకపోవడంతో ఆయన కూడా ఎలిమినేషన్స్ నుంచి తప్పుకున్నారు. మొత్తానికైతే రేవంత్ ,శ్రీ సత్య, ఆదిరెడ్డి , కీర్తి, రోహిత్ , ఫైమా ఈ ఆరుగురు నామినేషన్ లో ఉన్నారు. అయితే సోమవారం రాత్రి నుంచి అఫీషియల్ ఓటింగ్ ప్రాసెస్ స్టార్ట్ కాగా.. ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో ఈ ఓటింగ్ సాగుతూ ఉండడం గమనార్హం..

అయితే ఎన్ని ట్విస్ట్ లు ఉన్నా సరే తొలి స్థానంలో ఉన్నది మాత్రం రేవంత్ మాత్రమే. అయితే అనూహ్యంగా రోహిత్ అతనికి గట్టి పోటీ ఇస్తూ రెండో స్థానంలో నిలవడం విశేషం. ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లో జెన్యూన్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే అది మొదటిగా వినిపించే మాట రోహిత్.. ఆటలో గెలవడం ముఖ్యం కాదు.. ఎలా ఆడామన్నది కూడా ముఖ్యం అన్న సూత్రంతో ఆయన చాలా నిజాయితీగా ఆడుతున్నారు. అందుకే ప్రేక్షకుల మద్దతు కూడా పొందుతున్నారు. జెన్యూన్ ఆడియన్స్ నుంచి మద్దతు లభించడంతో టాప్ రేస్ లోకి దూసుకొచ్చాడు రోహిత్. మేరీనా వెళ్ళిపోయిన తర్వాత రోహిత్ ఆట కూడా మెరుగయింది. అంతేకాదు గట్టిగా మాట్లాడుతూ పాయింట్ టు పాయింట్ మాట్లాడుతూ రేస్ లోకి దూసుకు వస్తున్నాడు రోహిత్.

కామన్ మ్యాన్ కోటా కింద హౌస్ లోకి వచ్చిన ఆదిరెడ్డి ప్రస్తుతం మూడో స్థానంలో ఉండగా కీర్తి నాలుగవ స్థానం శ్రీ సత్య ఐదవ స్థానం, చివరి స్థానంలో ఫైమా ఉన్నారు. అయితే ఇద్దరిలో ఫైమా, శ్రీసత్యాలు ఎవరో ఒకరు ఎలిమినేట్ కావాల్సి ఉంటుంది. నిజానికి గత వారమే ఫైమా ఎలిమినేట్ కావాల్సి ఉండగా ఏవిక్షన్ ఫ్రీ పాస్ తో సేవ్ అయింది. అయితే ఫైనల్ కి వెళ్ళేది ఐదుగురు కంటెస్టెంట్ లు అయిన తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మేనేజ్మెంట్ కోటా కింద ఆదిరెడ్డిని ఎలిమినేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం. మేనేజ్మెంట్ కోటా కింద ఓట్లు పరిగణలోకి తీసుకోరు. మొత్తానికైతే ఆదిరెడ్డి బలి కాబోతున్నాడని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news