ఆయనకు నచ్చిన అమ్మాయి కోసం**.. నాగార్జున పై షాకింగ్ కామెంట్స్ చేసిన నేహా..!

తెలుగులో ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే.. ఎప్పటిలాగే ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో మూడవ సీజన్లో ప్రముఖ నటి నేహా ఎలిమినేట్ అవ్వడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈమె కంటే చెత్తగా పెర్ఫార్మన్స్ చేసేవారు కూడా హౌస్ లో ఉన్నారు. కానీ ఈమె ఏ కారణం చేత ఎలిమినేట్ అయ్యింది అనే విషయం మాత్రం తనకే తెలియదంటూ వాపోయింది. ఇక హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్న నేహా అందులో భాగంగానే నాగర్జున పై కూడా ఆరోపణలు చేసింది.

ఇక నేహా చౌదరి బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించినప్పుడు ఆమె కచ్చితంగా టాప్ 5 లో ఉంటుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆమె ఫిజికల్ గేమ్ కూడా మంచిగా ఆడుతుండడంతో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని కూడా ఫిక్స్ అయ్యారు. కానీ అనూహ్యంగా మూడవ వారంలోనే నేహాను బయటకు పంపడం జరిగింది. ఇక ఈ క్రమంలోనే నేహా చౌదరి హోస్ట్ నాగార్జునపై పలు షాకింగ్ కామెంట్స్ చేసింది. తాజాగా జరిగిన ఒక ఇంటర్వ్యూలో నేహా చౌదరి మాట్లాడుతూ.. నేను ఎలిమినేట్ అయ్యాను అంటే చాలామంది నమ్మడం లేదు. దీనిని అన్ పెయిర్ అంటున్నారు. ముఖ్యంగా కంటెంట్ ఇవ్వని వాళ్లు కూడా హౌస్ లో చాలామంది ఉన్నారు. వారి పేర్లను మాత్రం నేను చెప్పను.. ఇక వాసంతి దగ్గర నుంచి కంటెంట్ అసలు రావట్లేదు. గ్లామర్ డాల్ గా బిగ్ బాస్ హౌస్ లో ఉంది అంటూ చెప్పుకొచ్చింది.

ఇక ఇనయ విషయంలో ఇంట్లో వాళ్ళు రాంగ్ గానే మాట్లాడారు. కానీ వీకెండ్ లో నాగార్జున వచ్చి నా వెర్షన్ తీసుకుని మొత్తం రివర్స్ చేసేసారు. నిజంగా నాది మిస్టేక్ అయితే ఆ ఎపిసోడ్లో ఎందుకు హైలైట్ చేయలేదు? ఎందుకంటే నన్ను ఎలిమినేట్ చేయాలని వారు ముందే ఫిక్స్ అయ్యారు కాబట్టి..అందుకే నన్ను బ్యాడ్ చేశారు అంటూ చెప్పుకొచ్చింది.. ఇక నాగార్జున కావాలనే ఒకరిద్దరిని హైలెట్ చేస్తున్నాడు అంటూ తెలిపింది . అంతేకాదు ఈ డౌట్ హౌస్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఉంది అంటూ పలు ఆరోపణలు చేసింది నేహా.