త‌న‌ను ట్రోల్ చేయండి అంటూ రిక్వెస్ట్ చేస్తున్న షణ్ముఖ్ జశ్వంత్..

యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జశ్వంత్ గురించి పెద్ద‌గా పరిచయం అక్క‌ర్లేదు. సాఫ్ట్‏వేర్ డెవలపర్ వెబ్ సిరీస్‏తో విప‌రీత‌మైన ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ఈయ‌న‌. ఇక దీనితో వ‌చ్చిన క్రేజ్‌తో యూట్యూబ్ హీరోగా మారిపోయాడు. ఇక దాని తర్వాత వ‌చ్చిన సూర్య వెబ్ సిరీస్‏తో కూడా అదే స్థాయిలో దూసుక‌పోయింద‌ని చెప్పొచ్చు. ఇక ఈ రెండు వెబ్ సిరీస్‌ల త‌ర్వాత తాజాగా బిగ్‏బాస్ తెలుగు సీజన్ 5 లోకి వ‌చ్చారు ఆయ‌న‌. అయితే ఆయ‌న ఇలా ఎంట్రీ ఇచ్చాడో లేదో గానీ ఆయ‌న ఫ్యాన్స్ మాత్రం నానా హంగా చేస్తున్నారు.

సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు ఫుల్ స‌పోర్టు వ‌స్తోంది. ఇక ఇలాంటి త‌రుణంలో ఆయ‌న ఇప్పుడు ఓ వీడియోతో హ‌ల్ చ‌ల్ చేస్తున్నారు. బిగ్‏బాస్ సీజన్ 5లో షణ్ముఖ్ ఉంటాడంటూ చాలా రోజులుగానే వార్త‌లు వ‌స్తున్నాయి. కాగా అంతా ఊహించిన‌ట‌న్టు గానే ష‌ణ్ముఖ్ బిగ్ బాస్ హౌస్ లోకి వ‌చ్చాడు. ఇక ఈ త‌రుణంలో సోష‌ల్ మీడియాలో ఆయ‌న‌కు సంబంధించిన వీడియో ఒక‌టి బాగా వైర‌ల్ అవుతోంది. అయితే ఇది బిగ్ బాస్ హౌస్‌కు రాక‌ముందు ఆయ‌న చేసిన వీడియో అన్న‌ట్టు తెలుస్తోంది.

ఇందులో ఆయ‌న మాట్లాడుతూ ఈ వీడియో మీరు చూసే సమయానికి మీకు అన్ని విష‌యాలు అర్థమైపోయి ఉంటాయ‌ని అనుకుంటున్నాని అని చెప్పారు. ఇక తాను త్వ‌ర‌లోనే కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాన‌ని, ఇలాంటి త‌రుణంలో మీ స‌పోర్టు కావాలంటూ ఆయ‌న అభిమానుల‌ను కోరుతున్నారు. ఇక త‌న‌ను సోష‌ల్ మీడియాలో ట్రోలింగ్ చేయాలంటూ కోరుతున్నారు. ఇక త‌న‌పై ఫేక్ న్యూస్ కూడా వేయండంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. త‌న‌పై ఎక్కువ వైర‌ల్ న్యూస్ రాయాల‌ని వీలైనంత వ‌ర‌కు ట్రెండింగ్ లో ఉండే విధంగా చూడాలంటూ కోరుతున్నారు. మొత్తానికి ఆయ‌న చేసిన ప‌ని బాగానే వ‌ర్కౌట్ అవుతోంది.