బిగ్ బాస్ తెలుగు : ఐదవ సీజన్లో హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్లు

తెలుగు బుల్లితెర మీద అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షోగా పేరు తెచ్చుకున్న బిగ్ బాస్ తెలుగు , ఐదవ సీజన్లోకి ప్రవేశించింది. నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 5, ఈరోజే మొదలైంది.

ప్రతీసారీ లాగే ఈసారి కూడా అట్టహాసంగా మొదలైన షోకి మొట్టమొదటి కంటెస్టెంట్ గా యూట్యూబర్ వచ్చింది. సిరి హనుమంతు మొదటి కంటెస్టెంట్ గా బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టింది.

రెండవ కంటెస్టెంట్ గా సీరియల్ నటుడు విజయ్ సన్నీ వచ్చారు. చూస్తుంటే ఈ సారి హౌస్ లో లవర్ బాయ్ గా విజయ్ సన్నీనే అయ్యేలా ఉన్నాడు. ఎందుకంటే బొమ్మలాంటి అమ్మాయిని కనిపెట్టాలని నాగార్జునే చెప్పారు మరి.

మూడవ కంటెస్టెంట్ గా లహరి షెహరి వచ్చింది. నాగార్జునకు రోజాపువ్వును అందించి, సంవత్సరం వరకు ఈ పువ్వు వాడిపోదని, ఇలాగే ఉంటుందని తెలిపింది.

ఐదవ కంటెస్టెంట్ గా అందరికీ తెలిసిన సింగర్ శ్రీరామ్ చంద్ర వచ్చాడు. ఇండియన్ ఐడల్ సీజన్ 5 విజేతగా నిలిచిన శ్రీరామ్ కి ఉత్తరాదిన మంచి ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ ద్వారా తెలుగు వారిలోనూ మంచి గుర్తింపు తెచ్చుకుననే అవకాశం వచ్చింది.

బిగ్ బాస్ లో ఎప్పుడూ అబ్బాయిలే గెలుస్తారా? ఈసారి నేను గెలిచి బిగ్ బాస్ తెలుగు గెలిచిన మొదటి మహిళగా చరిత్ర కెక్కుతానంటున్నారు కొరియోగ్రాఫర్ యానీ.

సోషల్ మీడియాలో బాగా ప్రాచుర్యం ఉన్న మరో వ్యక్తి లోబో. లోబో పేరు రావడానికి కారణం కనకిస్థాన్ అమ్మాయికి టాటూ వేయడమే అనీ, ఆమే లోబో అని పెట్టిందని చెప్పుకొచ్చాడు.

జీవితంలో ఎలాంటి సమస్యలైనా వస్తే ఒంటరిగా నేను నెగ్గుకురాగలనా? సమస్యలు వచ్చినపుడు నేనెలా ఉంటాను? తెలుసుకుందామని బిగ్ బాస్ హౌస్ కి వచ్చానని నటి ప్రియ చెప్పుకొచ్చింది. దీనికి అవన్నీ నెగ్గుకురాకుండానే ఇన్నేళ్ళు ఇండస్ట్రీలో ఉంటున్నావా అంటూ నాగార్జున చమత్కరించారు.

ఇక యూట్యూబ్ లో ఎక్కువ పేరున్న షణ్ముఖ్ జస్వంత్ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు. సాఫ్ట్ వేర్ డెవలపర్, సూర్య లాంటి సిరీస్ లతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న షణ్ముఖ్, హౌస్ లోకి అడుగుపెట్టాడు.

ఇక బిగ్ బాస్ లో ట్రాన్స్ జెండర్, నటి ప్రియాంక సింగ్ వచ్చారు. ట్రాన్స్ జెండర్ గా మారడానికి కారణాన్ని వివరించిన ప్రియాంక సింగ్, అందరినీ భావోద్వేగానికి గురి చేసారు.

11వ కంటెస్టెంటుగా హమిదా హౌస్ లోకి వచ్చింది.

అలాగే 12వ కంటెస్టెంటుగా నటరాజ్ వచ్చారు. డాన్స్ షోలలో జడ్జ్ గా పాపులర్ అయిన నటరాజ్ సీరియల్స్ లోనూ నటించాడు.

13వ కంటెస్టెంటుగా యూట్యూబర్ సరయు వచ్చారు. సెవెన్ ఆర్ట్స్ ఛానల్ ద్వారా విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న సరయూ అందరికీ పరిచయమే.

14వ కంటెస్టెంటుగా నటుడు విశ్వ హౌస్ లో అడుగుపెట్టాడు. యువ వంటి సీరియల్ లో నటించిన విశ్వ సినిమాల్లోనూ చేసారు.

15వ కంటెస్టెంటుగా నటి ఉమాదేవి హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. సినిమాల్లో చిన్న చిన్న పాత్రల్లో మెరిసిన ఉమాదేవి, సీరియల్స్ లోనూ కనిపిస్తున్నారు.

16వ కంటెస్టెంటుగా మానస్ హౌస్ లోకి వచ్చారు. సీరియల్స్ ద్వారా మానస్ అందరికీ సుపరిచితుడే.

17వ కంటెస్టెంటుగా సీరియల్ నటి కాజల్ హౌస్ లోకి వచ్చారు.

18వ కంటెస్టెంటుగా శ్వేతా వర్మ హౌస్లోకి వచ్చింది. 5లక్ష్యాలతో 5వ సీజన్లోకి అడుగుపెట్టానని, ఇచ్చిపడేయడంలో ఎప్పుడూ ముందుంటానని చెప్పుకొచ్చింది.

19వ కంటెస్టెంటుగా యాంకర్ రవి హౌస్లో ప్రవేశించారు. తన కూతురు ఇచ్చిన బహుమానాన్ని చేతుల్లో పట్టుకుని, హౌస్ కి వచ్చారు.

 

View this post on Instagram

 

A post shared by BIGG BOSS TELUGU (@maabiggboss)