బాలయ్య మూవీ లో ఛాన్స్ కొట్టేసిన బిగ్ బాస్ విన్నర్..!

వరల్డ్ బిగ్గెస్ట్ రియాల్టీ షో గా గుర్తింపు తెచ్చుకున్న బిగ్ బాస్ షో గత కొన్ని నెలలుగా మొట్టమొదటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నాన్ స్టాప్ బిగ్ బాస్ షో ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ నేపథ్యంలో ఈ షోపై మొదట్లో ఎన్నో విమర్శలు వచ్చినా.. ఇందులో 18 మంది కంటెస్టెంట్ ల మధ్య హోరాహోరీగా పోటీ ఉండటంతో ప్రేక్షకులు సైతం చూడటానికి ఆసక్తి చూపించారు. ఆడ పులి లా బిందుమాధవి అందరితో పోరాడి. చివరికి టైటిల్ విజేతగా నిలిచింది. బిగ్ బాస్ హిస్టరీ లో మొట్టమొదటి సారి ఒక లేడీ టైటిల్ ను గెలుచుకోవడం గమనార్హం. ఇక తను చెప్పినట్లుగానే చివరికి బిగ్ బాస్ ఓటీటీ నాన్ స్టాప్ విన్నర్ గా నిలిచి టైటిల్ ను సొంతం చేసుకుంది.Balakrishna says 'I love you' to wife on 'Unstoppable' - Telugu News - IndiaGlitz.com

బిందు మాధవి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టినప్పుడు హోస్ట్ గా వ్యవహరిస్తున్న నాగార్జున ఎందుకు బిగ్ బాస్ లోకి వచ్చావు అని అడగగా.. తెలుగు సినిమాలలో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని.. అవకాశాల కోసమే ఇలా బిగ్ బాస్ లోకి వచ్చానని తెలిపింది. ఇక చెప్పినట్టుగానే ఆమె టైటిల్ విన్నర్ గా కప్ సొంతం చేసుకొన్న బిందు.. బాలయ్య సినిమాలో అవకాశాన్ని పొందింది ఈ ముద్దుగుమ్మ. ఇక బిందుమాధవి కోసం ప్రత్యేకంగా ఒక క్యారెక్టర్ ను డిజైన్ చేస్తానని.. అన్ని కుదిరితే బాలయ్య సినిమాలో నటించే అవకాశం కల్పిస్తానని బిందు మాధవికి హామీ ఇచ్చాడు ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడి.Bindu Madhavi Age, Family, Husband, Biography, Movies - Breezemastiఅనుకున్నట్టుగానే టైటిల్ ను సొంతం చేసుకుంది. ఇక మాట ఇచ్చినట్టుగానే అనిల్ రావిపూడి తన మాటను నిలబెట్టుకుంటారా లేద అని తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే జరిగితే బిందు మాధవి తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టినట్లు అని ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి అయితే చివరి రెండు వారాల్లో బిందుమాధవి – అఖిల్ కి గట్టి పోటీ ఇచ్చి చివరికి టైటిల్ విజేతగా నిలిచింది.