‘ బిగిల్ ‘ వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్‌… విజ‌య్ టార్గెట్ ఇదే

-

కోలీవుడ్ ఇళ‌య ద‌ళ‌పతి విజ‌య్ వ‌రుస హిట్ల‌తో దూసుకు పోతున్నాడు. కోలీవుడ్‌లో విజ‌య్‌, అజిత్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బాక్సాఫీస్ ద‌గ్గ‌ర ఎలా పండ‌గ వాతావ‌ర‌ణం ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఇక ఈ ఇద్ద‌రు అగ్ర హీరోల అభిమానుల మ‌ధ్య కూడా పెద్ద యుద్ధ‌మే న‌డుస్తుంటుంది. త‌మ హీరోయే గొప్ప అని అటు అజిత్ అభిమానులు.. త‌మ హీరోయే గొప్ప అని ఇటు విజయ్ అభిమానుల మ‌ధ్య జ‌రిగే వార్ అంతా ఇంతా కాదు.

ఇక తాజాగా విజ‌య్ అట్లీ ద‌ర్శ‌క్వంలో న‌టిస్తోన్న మూడో సినిమా బిగిల్‌. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ నేప‌థ్యంలో వ‌స్తోన్న ఈ సినిమాను దీపావ‌ళి కానుక‌గా అక్టోబ‌ర్ 26న తమిళ్‌తో పాటు తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాను తెలుగులో విజిల్ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌ముఖ పీఆర్వో మ‌హేష్ ఎస్ కోనేరు ఈస్ట్‌కోస్ట్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై ఈ సినిమాను ఇక్క‌డ రిలీజ్ చేస్తున్నారు.

గ‌తంలో విజ‌య్ అట్లీ కాంబోలో పోలీసోడు (తెరీ), అదిరింది (మెర్సల్‌) సినిమాలు వ‌చ్చి హిట్ అయ్యాయి. ఇక ఇది త‌మ కాంబోలో హ్యాట్రిక్ అవుతుంద‌ని విజ‌య్‌, అట్లీ ధీమాతో ఉన్నారు. న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమా రు.150 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కింది. బిగిల్ థియేటర్ మరియు నాన్-థియేట్రికల్ హక్కులతో సహా రూ .222 కోట్ల వ‌ర‌ల్డ్ వైడ్ ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది.

బిగిల్ (విజిల్) ప్రి రిలీజ్ బిజినెస్ (రూ.కోట్ల‌లో) :

తమిళనాడు – 85

కేరళ & కర్ణాటక – 16

తెలుగు – 9

ఓవ‌ర్సీస్‌ – 28

థియేట్రికల్ – 140

నాన్-థియేట్రికల్ – 82
—————————————————–
టోట‌ల్ ప్రి రిలీజ్ బిజినెస్ = రూ .222 కోట్లు
—————————————————–

Read more RELATED
Recommended to you

Exit mobile version