‘బింబిసార’ ఓటీటీ రిలీజ్ డేట్ లో మార్పు.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

చాలా రోజుల తర్వాత బింబిసార సినిమాతో కల్యాణ్ రామ్ హిట్ అందుకున్నాడు. విశిష్ఠ్ దర్శకత్వంలో ఫాంటసీ డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ ఇటు ప్రేక్షకులతో పాటు అటు బాక్సాఫీస్ వద్ద కూడా సూపర్ హిట్ గా నిలిచింది. హర్యాంక వంశస్థుడు బింబిసారుని జీవిత క‌థ నేప‌థ్యంలో వ‌చ్చిన ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్ బింబిసార చ‌క్ర‌వ‌ర్తిగా, దేవ‌ద‌త్తుడిగా ద్విపాత్రాభిన‌యం చేశాడు.

ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక జీ-5లో అక్టోబర్ 5న విడుదలవనున్నట్లు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఇప్పుడు బింబిసార సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ మారింది. ఈ మూవీ అక్టోబర్ 21న జీ 5లో  స్ట్రీమింగ్ కానుంది. ఈ విష‌యాన్ని జీ 5 సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌క‌టించింది. బింబిసార‌ చిత్రంలో కేథ‌రిన్ థెరిసా, సంయుక్తా మీన‌న్ హీరోయిన్లుగా నటించారు.

క‌ల్యాణ్ రామ్ హోమ్ బ్యాన‌ర్‌ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై బింబిసార‌ చిత్రాన్ని నిర్మించారు. బింబిసారసీక్వెల్ వివ‌రాలపై త్వ‌ర‌లో క్లారిటీ వ‌చ్చే ఛాన్స్ ఉన్న‌ట్టు ఫిలింన‌గ‌ర్ స‌ర్కిల్ టాక్‌.