కల్యాణ్ రామ్ ‘బింబిసార’పై తారక్ రివ్యూ.. ట్వీట్ వైరల్

నందమూరి కల్యాణ్ రామ్ నటించిన టైమ్ ట్రావెల్ మూవీ ‘బింబిసార’ శుక్రవారం విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నది. ఈ సినిమా చూసిన నందమూరి అభిమానులు థియేటర్ల వద్ద ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘బాహుబలి’రేంజ్ లో పిక్చర్ ఉందని అంటున్నారు. ఇక తాజాగా ఈ సినిమా గురించి నందమూరి తారక రామారావు జూనియర్ (తారక్) ట్వీట్ చేశారు.

‘బింబిసారుడి’గా నందమూరి కల్యాణ్ రామ్ ను ఎవరూ రిప్లేస్ చేయలేరని, దర్శకుడు వశిష్టను సినిమాను చాలా బాగా హ్యాండిల్ చేశారని, కీరవాణి ఈ ఫిల్మ్ కు బ్యాక్ బోన్ అని ట్వీట్ లో తారక్ పేర్కొన్నారు. ఈ చిత్రం కోసం పని చేసిన నటీ నటులు, టెక్నీషియన్స్ అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.

NTR Anil Ravipudi movie is on Cards

తాను ‘బింబిసార’ గురించి చక్కటి విషయాలు గొప్పగా వింటున్నానని, ప్రతీ ఒక్కరు ఈ సినిమాను చూసి ఎంజాయ్ చేస్తున్నారని, ఇది గొప్ప విషయమని తెలిపారు తారక్. ఒక సినిమా చూసిన తర్వాత ఇంతటి చక్కటి రెస్పాన్స్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అని తారక్ మరో ట్వీట్ లో పేర్కొన్నారు. ఈ సినిమా ద్వారా దర్శకుడు వశిష్ట టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా తారక్ వచ్చి బెస్ట్ విషెస్ చెప్పిన సంగతి అందరికీ విదితమే. మొత్తంగా నందమూరి అభిమానులు హ్యాపీగా ఫీలవుతున్నారు.