RRR : ఆర్ఆర్ఆర్ పై బాలీవుడ్ న‌టి కంగ‌న ర‌నౌత్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

-

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్… స్టార్ డైరెక్ట‌ర్ రాజ‌మౌళి కాంబినేషన్ లో వ‌చ్చిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రికార్డుల‌ను తిర‌గ రాస్తుంది. భార‌త దేశ సినిమా చ‌రిత్ర‌లోనే ది బెస్ట్ మూవీగా ఆర్ఆర్ఆర్ చరిత్ర సృష్టిస్తుంది. సినీ విమ‌ర్శ‌కుల నుంచి కూడా ఆర్ఆర్ఆర్ కు ప్ర‌శంసలు అందుతున్నాయి. అయితే తాజా గా ఈ సినిమాపై బాలీవుడ్ వివాద‌స్ప‌ద హీరోయిన్ కంగ‌న ర‌నౌత్ స్పందించింది. కంగ‌న ఈ మధ్య కాలంలో ప‌లు వివాదాల్లోకి వెళ్లి.. ఫైర్ బ్రాండ్ గా పేరు కూడా తెచ్చుకుంది.

అలాగే ఈ ఫైర్ బ్రాండ్ కంగ‌న ర‌నౌత్.. ఇటీవల కొన్ని సినిమాల‌కు రివ్యూలను కూడా ఇస్తుంది. ఆమె ఇచ్చే రివ్యూలు త‌న లాగే.. వివాద‌స్ప‌దంగా ఉంటాయి. అయితే ఈ ఫైర్ బ్రాండ్ తాజా గా ఆర్ఆర్ఆర్ సినిమాకు కూడా రివ్యూ ఇచ్చింది. అయితే గ‌తంలో కాకుండా.. ఆర్ఆర్ఆర్ సినిమాపై ద‌ర్శ‌కుడు రాజ‌మౌళిపై కంగ‌న ఈ సారి పొగుడ్తూ రివ్యూ ఇచ్చింది.

ఎస్ ఎస్ రాజ‌మౌళి మ‌రోసారి గొప్ప ద‌ర్శ‌కుడు అని నిరూపించుకున్నార‌ని అంది. అలాగే రాజ‌మౌళి తీసిన సినిమాల్లో ఒక్క ప్లాప్ లేదంటూ వ్యాఖ్యానించింది. ఆయ‌న విజ‌యాలే కాదు.. ఆయ‌న విన‌యం గురించి కూడా కంగ‌న ర‌నౌత్ ప‌లు ఆస‌క్తిర వ్యాఖ్య‌లు చేసింది. దేశం కోసం ఆయ‌న న‌మ్ముకున్న ధ‌ర్మం కోసం రాజ‌మౌళి చూపించే ప్రేమ గొప్ప‌దని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news