సాయిప‌ల్ల‌విపై బాలీవుడ్ డైరెక్ట‌ర్ల ఫోక‌స్‌.. ట్యాలెంట్ ఉంటే ఇలాగే ఉంటుంది మ‌రి!

-

సాయిప‌ల్ల‌వి అంటే మంచి ట్యాలెంట్ ఉన్న హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఏ సినిమా అయినా స‌రే ఆమె పాత్ర‌కు మంచి క్రేజ్ ఉంటుంది. ఇక త‌న పాత్ర‌కు మంచి స్కోప్ ఉంటేనే ఆ సినిమా చేస్తుంది. లేదంటే పెద్ద హీరో సినిమా అయినా స‌రే రిజెక్ట్ చేస్తుంది. అందుకే ఆమెకు నేచుర‌ల్ బ్యూటీగా మంచి పేరుంది. ఆమెకు ఉన్న ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది.

 

న‌ట‌నతో పాటు డ్యాన్సుల్లోనూ ఆమెకు సాటిలేద‌నే చెప్పాలి. అందుకే ఆమె సాంగ్ అంటే యూత్ ఎగబడి మరీ చూస్తుంటారు. ఈ కారణంతోనే రౌడీ బేబీ పాట ఏకంగా వంద కోట్ల వ్యూస్ తెచ్చుకుంది. ఇక సోష‌ల్ మీడియాలో విప‌రీత‌మైన ఫాలోయింగ్ ఈ బ్యూటీకే ఉంది. గ్లామ‌ర్ డోసు ఇవ్వ‌క‌పోయినా అంత పాలోయింగ్ ఉంది ఈమెకు.

సాయి పల్లవికి ఉన్న ఈ క్రేజ్‌తోనే సౌత్ ఇండియాలో స్టార్ హీరోయిన్‌గా దూసుకుపోతోంది. దీంతో ఆమెను బాలీవుడ్‌లో లాంచ్ చేయాలని చాలామంది హిందీ డైరెక్ట‌ర్లు ట్రై చేస్తున్నారు. ప్ర‌స్తుతం సాయి పల్లవికి హీరోల రేంజ్‌లోనే ఫాలోయింగ్ ఉంది. ఈ కార‌ణాల‌తోనే సాయి పల్లవిని ఎలాగైనా బాలీవుడ్‌లో ప‌రిచ‌యం చేయాల‌ని చూస్తున్నారు. కానీ ఆమె మాత్రం మంచి క‌థ వ‌స్తేనే చేస్తాన‌ని చూస్తూ ఉంది. చూడాలి మ‌రి ఏ సినిమాతో ఎంట్రీ ఇస్తుందో.

Read more RELATED
Recommended to you

Latest news