చంద్రబాబు లేఖపై సజ్జల కౌంటర్ : అవి అన్నీ అబద్దాలే

-

సిఎం జగన్ కు చంద్రబాబు రాసిన లేఖపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలోని రైతాంగం పట్ల ప్రతిపక్ష నేత చంద్రబాబు వల్లమాలిన ప్రేమ కనపరుస్తున్నారని.. ధాన్యం సేకరణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపిస్తున్నారని పేర్కొన్నారు. రెండు, మూడు అంశాలపై సీఎం జగన్ కు చంద్రబాబు లేఖ రాశారని… సీఎంకు చంద్రబాబు రాసిన లేఖలో పూర్తిగా అబద్దాలు ప్రస్తావించారని మండిపడ్డారు. చంద్రబాబు సహజ స్వభావానికి అనుగుణంగానే ఆయన లేఖ కూడా ఉందని.. తన హయాంలో 48 గంటల్లోనే ధాన్యం సేకరణ సొమ్ము చెల్లించామని చంద్రబాబు అసత్యాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.

రైతుల్లో లేని ఆందోళన భయం సృష్టించి ఏం సాధిద్దామని చంద్రబాబు అనుకుంటున్నారో అర్థం కావడం లేదని… చంద్రబాబు హయాంలో రైతులకు ఎక్కడా గిట్టుబాటు ధర దక్కలేదని నిలదీశారు సజ్జల. కౌలు రైతులకు సంబంధించి చంద్రబాబు చేసిందేమీ లేదని.. వైసీపీ ప్రభుత్వం వచ్చాక కౌలు రైతులకు అన్ని విధాలా ఆదుకునేలా చర్యలు తీసుకుందన్నారు. పండించిన ప్రతి గింజను సేకరించడం సహా గిట్టబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకున్నామని.. ఇన్ పుట్ సబ్సిడీ , బీమా మొత్తాన్ని కాలెండర్ ప్రకారం రైతులకు అందిస్తున్నామని పేర్కొన్నారు. ఆరోపణలు చేయడంలో టీడీపీ, బీజేపీ పోటీ పడుతున్నాయని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Latest news