తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోయిన్లలో హీరోయిన్ టబుకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది. అప్పట్లో తన అందచందాలతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక నాగార్జునతో కలిసి ఆమె నటించిన ప్రతి సినిమా కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక నిన్నే పెళ్ళాడుతా సినిమా లో టబు, నాగార్జున మధ్య జరిగే రొమాన్స్ సన్నివేశాలు ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. అయితే హీరోయిన్ టబు ప్రస్తుతం ఐదు పదుల వయస్సుకు వచ్చినప్పటికీ ఇంకా వివాహం చేసుకోలేదు. అయితే ఈ విషయంపై పలు ఆసక్తికరమైన విషయాలు బాగా వినిపిస్తున్నాయి వాటి గురించి ఇప్పుడు చూద్దాం.
తెలుగులో నాగార్జునతో కలిసి ఎన్నో సినిమాలలో నటించిన టబు అతనితో ప్రేమలో ఉంది అనే వార్తలు కూడా వినిపించాయి. అంతేకాదు ముంబై లో ఉండే ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడు హైదరాబాద్కు వచ్చి నాగార్జునను కలిసి వెళ్ళేది అన్నట్లుగా వార్తలు వినిపించాయి.
కానీ ఈ విషయంపై నాగార్జున భార్య అమల స్పందించడం కూడా జరిగింది. కేవలం వారిద్దరు స్నేహితులే.. వారిద్దరి మీద ఎలాంటి వార్తలు వచ్చినా కూడా పట్టించుకోనని తెలియజేసింది.అయితే టబు కి వివాహం కాకపోవడానికి ముఖ్యమైన కారణం బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ అని గతంలో ఆమె చెప్పినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. తను ఎక్కడికి వెళ్ళినా తన ని ఫాలో అయ్యే వారిని తనతో ఎవరైనా మాట్లాడినా కూడా ఆయన తట్టుకునే వాడు కాదట. అయితే అతని కోసం ఈమె కూడా చాలా రోజులు ఎదురు చూస్తూనే ఉన్నదట. కానీ అజయ్ దేవగన్ కి ఎప్పుడో వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అజయ్ దేవగన్ హీరోయిన్ కాజోల్ ను వివాహం చేసుకుని సెటిల్ అయిపోయారు కానీ టబు మాత్రం అతని కోసమే ఇంకా ఒంటరిగా ఎదురుచూస్తోంది అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అలా బాలీవుడ్ హీరో చేతిలో మోసపోయింది టబు