ఇప్పటివరకు విలన్ గా నటించని ఏకైక హీరో ఆయనే..కారణం.?

-

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోలు ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న విషయం తెలిసిందే. ఒకానొక సమయంలో అవకాశాల కోసం విలన్ పాత్రలు పోషించి ఆ తర్వాత హీరోలుగా మారిన వారు ఉంటే హీరోలుగా సక్సెస్ సాధించిన తర్వాత విలన్ పాత్రలు చేసిన వాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే ఇక్కడ ఒక సీనియర్ దివంగత నటుడు మాత్రం స్టార్ హీరోనే కాదు తెలుగు సినీ పరిశ్రమకు మూల స్తంభం అయినప్పటికీ కూడా ఎన్నో చిత్రాలలో హీరో గానే నటించాడే తప్ప విలన్ గా ఒక చిత్రంలో కూడా నటించలేదు. మరి ఆయన ఎవరో ఇప్పుడు చూద్దాం.

మెగాస్టార్ చిరంజీవి కూడా మొదట్లో విలన్ పాత్రలు చేసి ఆ తర్వాత హీరోగా సక్సెస్ అయ్యి మెగాస్టార్ గా దూసుకుపోతున్నారు. ఎన్టీఆర్, జగ్గయ్య, కృష్ణ, కృష్ణంరాజు, మోహన్ బాబు, కాంతారావు ఇలా ఎంతోమంది దిగ్గజ నటులు హీరోలు గానే కాకుండా విలన్లుగా కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే అగ్ర హీరోగా తెలుగు సినీ పరిశ్రమని ఏలిన అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రం కెరియర్లో ఎప్పుడూ విలన్ గా నటించలేదు.అయితే కారణాన్ని కూడా ఆయన వెల్లడించారు.

అక్కినేని నాగేశ్వరరావు గారు ఇలా మాట్లాడుతూ.. నా కంఠం, నా రూపం విలన్ పాత్రలకు ఏమాత్రం సరిపోదు.. ప్రేక్షకులు నన్ను విలన్ గా అంగీకరించరు అనిపించింది. అందుకే ఎప్పుడూ కూడా నేను విలన్ పాత్రలు పోషించలేదు అంటూ అక్కినేని నాగేశ్వరరావు చెప్పుకొచ్చారు. ఇకపోతే 1940లో ధర్మపత్ని అనే సినిమా ద్వారా సినిమా ఇండస్ట్రీలోకి ప్రవేశించిన అక్కినేని నాగేశ్వరరావు.. సుమారుగా 250కి పైగా సినిమాలలో నటించి రికార్డు సృష్టించారు. ఇక చివరిగా తన కుటుంబంతో కలిసి 2014లో మనం అనే సినిమా చేశారు. అప్పటికే క్యాన్సర్ తో పోరాడుతున్న ఈయన పరిస్థితి విషమించి కొద్ది రోజులకే స్వర్గస్తులయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news