తండ్రి కాబోతున్న స‌ల్మాన్‌ ఖాన్?

-

సల్మాన్‌కి భవిష్యత్‌లో పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు. ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యంత బిజీయెస్ట్‌ స్టార్‌. దాదాపు ఐదు ప్రాజెక్ట్‌లు ఆయన కోసం క్యూలో ఉన్నాయి. ఇక సల్మాన్‌ ప్రస్తుతం అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘భారత్‌’ జూన్‌ 5న విడుదల కానుంది.

సల్మాన్‌ ఖాన్ త్వ‌ర‌లో తండ్రి కాబోతున్నాడా?. పిల్ల‌ల్ని క‌న‌బోతున్నాడా? అంటే అవున‌నే అంటున్నాయి బాలీవుడ్ వ‌ర్గాలు. తాజాగా ఆయన ఓ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారు. సరోగసి ద్వారా పిల్లలకి తండ్రి కావాల‌నుకుంటున్నారు. గతంలో బాలీవుడ్‌లో షారూఖ్‌ ఖాన్‌, అమీర్‌ ఖాన్‌, కరణ్‌ జోహార్‌, ఏక్తా కపూర్‌ వంటి ప్రముఖులు సరోగసి ద్వారా పిల్లలకి జన్మనిచ్చిన విషయం విదితమే.

Bollywood star salman khan to become father soon

సల్మాన్‌కి భవిష్యత్‌లో పెళ్ళి చేసుకునే ఉద్దేశం లేదు. కానీ సరోగసి ద్వారా పిల్లలని పొందాల‌ని ప్లాన్‌ చేస్తున్నట్టు తెలుస్తుంది. మ‌రి ఇందులో వాస్త‌వ‌మెంతా? అనేది మున్ముందు తేల‌నుంది. ఇదిలా ఉంటే స‌ల్మాన్ ఇప్పుడు బాలీవుడ్‌లో అత్యంత బిజీయెస్ట్‌ స్టార్‌. దాదాపు ఐదు ప్రాజెక్ట్‌లు ఆయన కోసం క్యూలో ఉన్నాయి. ఇక సల్మాన్‌ ప్రస్తుతం అలీ అబ్బాస్‌ జాఫర్‌ దర్శకత్వంలో నటిస్తున్న ‘భారత్‌’ జూన్‌ 5న విడుదల కానుంది. కత్రినా కైఫ్‌ హీరోయిన్‌గా, దిశా పటానీ మరో కథానాయికగా నటించిన ఈ చిత్రంలోని ‘అత్తే.. ఆ’ అంటూ సాగే సాంగ్‌ వీడియోను గురువారం సల్మాన్‌ విడుదల చేశారు. ఇందులో నల్ల దుస్తుల్లో సల్మాన్‌, ఎర్రచీరలో కత్రినా ఆకట్టుకుంటున్నారు. దీంతోపాటు ప్రభుదేవా దర్శకత్వంలో ‘దబాంగ్‌ 3’లో నటిస్తున్నారు.

సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. అనంతరం సంజరులీలా భన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా, సతీష్‌ కౌశిక్‌ దర్శకత్వంలో ‘తేరే నామ్‌’కి సీక్వెల్‌, ‘ఏక్‌ దా టైగర్‌’ రెండో సీక్వెల్‌కి ఇప్పటికే గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారట. మ‌రోవైపు 2004లో వ‌చ్చిన బ్లాక్ బ‌స్ట‌ర్ కిక్ కి సీక్వెల్ చేసే ఆలోచ‌న‌లో ఉన్నార‌ట‌. ఆ చిత్ర ద‌ర్శ‌కుడు సాజిద్ న‌డియ‌డ్‌వాలా ఓ ట్రెండీ స్ర్కిప్ట్ ని రెడీ చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. అన్నీ సెట్ అయితే ఈ సినిమా ఈ ఏడాది ఎండింగ్‌లోగానీ, వచ్చే ఏడాది ప్రారంభంలోగానీ షురూ కానున్న‌ట్టు టాక్‌.

మ‌రోవైపు నిర్మాతగానూ ఆయన పలు నయా స్క్రిప్ట్స్‌ని ఎంకరేజ్‌ చేస్తున్నారు. గ‌తంలో చిల్ల‌ర్ పార్టీ, డాక్ట‌ర్ క్యాబీ, హీరో, ల‌వ్ యాత్రీ వంటి లో బ‌డ్జెట్ చిత్రాల‌ను నిర్మించారు. త్వరలో రోహిత్‌ నియ్యర్‌ దర్శకత్వంలో ఓ సినిమాకి నిర్మించనున్నారట. గతంలో రోహిత్‌ ‘షాడో’ చిత్రాన్ని రూపొందించారు. తాజా సినిమా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా, రొమాంటిక్‌ కామెడీగా సాగుతుందట. అన్ని కుదిరితే ఈ ఏడాది ‘దబాంగ్‌ 3’ పూర్తయిన వెంటనే సల్మాన్‌ ప్రొడ్యూస్‌ చేసే ఈ సినిమా కూడా స్టార్ట్‌ అవుతుందని చిత్ర వర్గాలు అంటున్నాయి. ‘సెప్టెంబర్‌లో సినిమా ప్రారంభం కానుంది. ఢిల్లీలోనే షూటింగ్‌ మొత్తం జరుగుతుంది’ అని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news