ఫలితాల వేళ టీడీపీకి మరో దెబ్బ.. వైఎస్సార్సీపీలోకి టీడీపీ ఎంపీ ఫ్యామిలీ?

-

ఓవైపు టీడీపీ పక్కా గెలుస్తుందని హైకమాండ్ చెబుతున్నప్పటికీ… ఎందుకో పార్టీలోని కొందరు ముఖ్య నేతలకు ఈసారి టీడీపీ ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసిపోయిందట. దీంతో తట్టా బుట్టా సర్దేసుకొని గెలిచే పార్టీలోకి జంప్ అయిపోతే బెస్ట్ అని అనుకుంటున్నారట.

ఎన్నికలు ఉన్నా లేకున్నా… వైఎస్సార్సీపీలోకి వెళ్లే వలసల జోరు మాత్రం అస్సలు తగ్గట్లేదు. ఎన్నికలతో సంబంధమే లేకుండా వైఎస్సార్సీపీలోకి వలసలు పెరుగుతున్నాయంటే దాని అర్థం ఏంటి. ఈసారి జగన్ గెలవడం ఖాయమైపోయిందా? టీడీపీ ఓడిపోవడం కన్ఫమ్ అయిపోయిందా? అని రాజకీయ విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

ఓవైపు టీడీపీ పక్కా గెలుస్తుందని హైకమాండ్ చెబుతున్నప్పటికీ… ఎందుకో పార్టీలోని కొందరు ముఖ్య నేతలకు ఈసారి టీడీపీ ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసిపోయిందట. దీంతో తట్టా బుట్టా సర్దేసుకొని గెలిచే పార్టీలోకి జంప్ అయిపోతే బెస్ట్ అని అనుకుంటున్నారట.

ఈనేపథ్యంలో… గుంటూరు జిల్లా నరసరావుపేట ఎంపీ, టీడీపీ నేత రాయపాటి సాంబశివరావు, ఆయన ఫ్యామిలీ వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారట. త్వరలోనే వాళ్లు వైఎస్సార్సీపీలో చేరుతారు.. అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

ఆ ఊహాగానాలకు బలాన్నిస్తూ… రాయపాటి సోదరుడు శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకున్నాయి. రాయపాటి శ్రీనివాస్.. టీడీపీ నుంచి ఎమ్మెల్సీ టికెట్ ఆశించారు. కానీ… ఆయనకు టికెట్ దక్కలేదు. అయితే.. ఇటీవల ఓ సందర్భంలో మాట్లాడిన ఆయన… కాంగ్రెస్, టీడీపీ, జనసేనలపై విమర్శల వర్షం కురిపించారు కానీ… వైఎస్సార్సీపీ పార్టీని పల్లెత్తు మాట అనలేదు.

తన కొడుకు మోహన్ సాయికృష్ణ రాజకీయ భవిష్యత్తు కోసం శ్రీనివాస్ వైఎస్సార్సీపీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. మరోవైపు శ్రీనివాస్ అన్న సాంబశివరావు టీడీపీ ఎంపీ. ఆయన అనుమతి లేకుండానే టీడీపీపై శ్రీనివాస్ ఇలాంటి విమర్శలు చేశారా? అన్న అనుమానం కూడా ఏపీ ప్రజల్లో కలుగుతోంది. అంటే.. రాయపాటి ఫ్యామిలీ మొత్తం వైఎస్సార్సీపీ వైపు చూస్తోందని అర్థమైపోతోందని అంతా అనుకుంటున్నారు.

రాయపాటి సాంబశివరావు కూడా టీడీపీ హైకమాండ్ పై అసంతృప్తితోనే ఉన్నారు. తన కొడుకు రంగబాబుకు సత్తెనపల్లి ఎమ్మెల్యే టికెట్ ను చంద్రబాబు ఇవ్వలేదన్న కోపంతో ఉన్నారు దీంతో ముందుగా… తన తమ్ముడు శ్రీనివాస్ కుటుంబాన్ని వైసీపీలో చేర్చి.. ఆ తర్వాత తన కుటుంబంతో సహా వైసీపీలో చేరాలన్నది సాంబశివరావు ప్లాన్ గా తెలుస్తోంది. అయితే.. గుంటూరు జిల్లాలోనే రాజకీయంగా కాస్త పలుకుబడి ఉన్న ఫ్యామిలీ రాయపాటి వాళ్లది. వాళ్లంతా వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకుంటే.. ఇక గుంటూరులో టీడీపీ దాదాపు ఖాళీ అయినట్టేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news