బ్రహ్మానందంకు గుండె ఆపరేషన్

-


హాస్య బ్రహ్మ బ్రహ్మానందంకు బైపాస్ సర్జరీ జరిగింది. సోమవారం ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్ట్యూట్ లో హార్ట్ సర్జరీ పూర్తయిందని సమాచారం. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న బ్రహ్మానందం ఆదివారం టెస్టులు చేయించుకోగా సర్జరీ అవసరమని డాక్టర్స్ సూచించారట. ఆలస్యం చేయకుండా బైపాస్ సర్జరీ చేయించారట.

ప్రస్తుతం బ్రహ్మానందం పరిస్థితి నిలకడగానే ఉందని తెలుస్తుంది. ఆయన తనయులు గౌతం, సిద్ధార్థ్ లతో పాటుగా ఇతర కుటుంబ సభ్యులు కూడా హాస్పిటల్ లో ఉన్నారట. కార్డియాక్ సర్జన్ పాండా బ్రహ్మానందంకు సర్జరీ చేశారని తెలుస్తుంది. బ్రహ్మానందం హార్ట్ సర్జరీపై పరిశ్రమ వాళ్లు కాస్త కంగారు పడగా ఆపరేషన్ సక్సెస్ అవడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news