BREAKING: సింగర్ మంగ్లీ కారుపై రాళ్లదాడి

-

సింగర్ మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగింది. ఓ ప్రొగ్రామ్ లో పాల్గొని వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. కర్ణాటకలోని బళ్లారిలో ఈ ఘటన జరిగింది. బళ్లారి మున్సిపల్ కళాశాల మైదానంలో జరిగిన బళ్లారి ఫెస్టివ్ కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్తుండగా ఆమె కారుపై కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఆమె కారుపై రాళ్లదాడి జరిపారు. ఈ వేడుకకు సీనియర్ నటుడు రాఘవేంద్ర రాజ్‌కుమార్, పునీత్ రాజ్‌కుమార్ భార్య అశ్విని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

కొన్ని రోజుల క్రితం చిక్కబళ్లాపుర్ లోనూ జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ పాల్గొంది. ఆ సమయంలో కన్నడలో మాట్లాడాలని మంగ్లీని ప్రముఖ యాంకర్ అనుశ్రీ కోరారు. ఆ సమయంలో అందరికీ తెలుగు వస్తుందని మంగ్లీ మాట్లాడలేదు. యాంకర్ బలవంతం చేయగా కన్నడలో ఒకటి రెండు మాటలు మాట్లాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలోనే ఆమెపై రాళ్లదాడి జరిగినట్లుగా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news