“ఊ అంటావా” మాస్ పాట‌కు క్లాస్ ప్టెప్పులు… బీటీఎస్ బ్యాండ్ వీడియో వైరల్….!

-

అల్లు అర్జున్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా పుష్ప. ఈ సినిమా థియేటర్లలో కలెక్షన్ల వర్షం కురిపించింది. రీసెంట్ గా ఓటిటిలో విడుదలైన ఈ సినిమాకు సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమా విడుదల కాగా చూసిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ కూడా ప్లస్ గా నిలిచిన సంగతి తెలిసిందే. దేవీ శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలోని ప్రతి పాట ఆకట్టుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలోని “ఊ అంటావా మామ అనే పాట యూ ట్యూబ్ ను షేక్ చేస్తోంది.

bts Oo antava

ఇప్పటికే ఈ పాటకు మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ ఈ పాట మంచి క్రేజ్ ని సంపాదించుకుంది. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లోనూ సమంత పాటకు సెలబ్రిటీలు స్టెప్పులు వేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇక ఈ పాటకు బాలీవుడ్ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు ఊ అంటావా పాటకు ప్రముఖ కొరియన్ పాప్ సింగింగ్ బ్యాండ్ బిటిఎస్ చేసిన బాయ్ విత్ లవ్ అనే పాట స్టెప్పులకు ఊ అంటావా పాటను బ్యాగ్రౌండ్ గా సరిగ్గా సరిపోయేలా ఎడిట్ చేశారు. ఈ వీడియోలో బీటిఎస్ బృందంలోని జిన్ ఆర్ ఎం, సుగా, జినిన్, జే హోప్, వి జంగ్, కూక్ స్టెప్పులు వేశారు. బీటీఎస్ బీటుకు ఊ అంటావా పాట సెట్ అవ్వడం తో నెటిజన్లు అవాక్కవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ పాటకు మిలియన్ల కొద్దీ వ్యూవ్స్ లక్షల కొద్దీ లైకులు వస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by qualiteaposts (@qualiteaposts)

Read more RELATED
Recommended to you

Latest news