ఎన్టీఆర్ కోసం బుచ్చిబాబు పాట్లు.. ఎప్పుడు ఛాన్స్ వ‌స్తుందో?

ఎన్టీఆర్ (JR NTR) ఇండ‌స్ట్రీలో అంద‌రు డైరెక్ట‌ర్ల‌కు మోస్ట్ వాంటెడ్ హీరో అనే చెప్పాలి. ఏ డైరెక్ట‌ర్ అయినా ఎన్టీఆర్‌తో చేసే ఛాన్స్ వ‌స్తే అస్స‌లు వ‌దులుకోడు. ఇక ఇప్ప‌టికే ఎన్టీఆర్ కోసం చాలామంది డైరెక్ట‌ర్లు ఎదురు చూస్తున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం యంగ్ టైగ‌ర్ ఆర్ ఆర్ ఆర్‌లో చేస్తుండ‌టంతో ఆ సినిమా కోస‌మే దాదాపుగా రెండేళ్లు ఇప్ప‌టికే కేటాయించాడు. అయినా ఇంకా పూర్తి కాలేదు.

 

దీంతో మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలా ఉంది. ఈ నేప‌థ్యంలో అస‌లు ఎన్టీఆర్ మ‌ళ్లీ ఎప్పుడు త‌మ‌కు దొర‌కుతాడా అని చాలామందే ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే కొర‌టాల శివ‌తో మూవీ ప్రారంభించినా ఇంకా సెట్స్ పైకి వెళ్ల‌లేదు. అలాగే ప్ర‌శాంత్‌నీల్‌లో కూడా సినిమా ఒప్పుకున్నాడు.

ఇదిలా ఉండ‌గా ఉప్పెనతో సంచ‌ల‌న విజ‌యం అందుకున్న డైరెక్ట‌ర్ బుచ్చిబాబుకు ఆల్మోస్ట్ ఎన్టీఆర్ సినిమా చేసేందుకు ఒప్పుకున్నాడ‌ని స‌మాచారం. అయితే ఇప్పుడున్న సినిమాల‌ను పూర్తి చేయ‌డానికి మ‌రో ఏడాదికి పైగా ప‌ట్టేలాగే ఉంది. మ‌రి అప్ప‌టి వరకు బుచ్చిబాబు వెయిట్ చేయక తప్పదనే చెబుతున్నారు సిని ప్రేమికులు. మ‌రి బుచ్చిబాబు అన్ని రోజులు ఎదురుచూస్తారా లేక వేరే ప్రాజెక్టు స్టార్ట్ చేస్తారా అనేది చూడాలి.