విరాట్ కోహ్లీ గురించి.. ఆయన క్రికెట్ లో సాధించిన విజయాల గురించి ఎవరికి తెలియదు. కానీ.. విరాట్ కోహ్లీ గురించి ఓ ఆసక్తికరమైన విషయం బయటికి వచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే చర్చ. గతంలోనే ఈ విషయం బయటికి వచ్చినా.. ఇప్పుడు అది నెటిజన్లను బాగా ఆకట్టుకుంటోంది. దీంతో నెటిజన్లు దానిపై ప్రత్యేకంగా చర్చపెట్టారు. ఇంతకీ ఏంటా విషయం.. అంటారా? పదండి అక్కడికే వెళ్దాం.
ఇవియన్ వాటర్… అర్థం కాలేదా? విరాట్ కోహ్లీ తాగే నీళ్లు అవి. అయితే ఏంటటా? అంటారా.. అక్కడే ఉంది ట్విస్ట్. సాధారణంగా వాటర్ బాటిల్ ఖరీదు ఎంతుంటుంది.. మా.. అంటే 20 రూపాయలు వేసుకోండి అంటారు. కానీ.. విరాట్ కోహ్లీ తాగే ఇవియన్ వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా? లీటరుకు 600 రూపాయలు. చెప్పా కదా మీరు ఖరీదు పేరు చెప్పగానే మీరు నోరెళ్లబెడతారని. వామ్మో.. నీళ్లను కూడా ఇన్ని డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? ఇంతకీ ఆ నీళ్లలో ఉన్న స్పెషాలిటీ ఏంటి అంటారా? ఇవియన్ వాటర్ కూ పేద్ద స్టోరీ ఉందండోయ్. పదండి… ఓసారి ఆ నీళ్ల సంగతేందో తెలుసుకుందాం.
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీళ్లు అట ఇవి. అంతే కాదు.. ఇవియన్ అనే కంపెనీ కూడా మామూలుదేమీ కాదు. అదో పెద్ద బ్రాండ్. అవి చాలా సహజసిద్ధమైన నీళ్లు. స్విట్జర్లాండ్ – ఫ్రాన్స్ మధ్యలో ఉన్న జెనీవా సరస్సు నుంచి నీళ్లను సేకరించి ఈ నీటిని తయారు చేస్తారు. ఈ నీళ్లను ఇదివరకు ఔషధాల తయారీలో ఉపయోగించేవారట. ఎందుకంటే.. ఆ ప్రాంతంలోని నేలలో ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయట. అవి ఆ నీళ్లలో కలిసి ఆ నీళ్లు కూడా నాచురల్ గానే ఖనిజ లవణాలను కలిగి ఉంటాయన్నమాట.
ఈ నీటిని హాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పోటీ పడి మరీ తాగుతారట. ఇండియాలో మాత్రం ఒక్క విరాట్ కోహ్లీ మాత్రమే తాగుతాడు ఈ నీళ్లను. విరాట్ కోహ్లీ ఫిట్ నెస్ రహస్యం కూడా ఈ నీళ్లదే కావచ్చు. ఒక లీటర్ ఇవియన్ నీళ్లలో 8 మిల్లీగ్రాముల కాల్షియం, 26 మిల్లీగ్రాముల మెగ్నీషియం, 6.8 మిలీగ్రాముల క్లోరైడ్, 1 మిల్లీగ్రామ్ పొటాషియం, 6,5 గ్రాముల సోడియం ఉంటాయి.