అల్లు స్టూడియో పెట్టడానికి అసలు కారణం తెలిపిన బన్నీ.!

-

హైదరాబాద్లోని గండిపేటలో 10 ఎకరాల స్థలంలో అత్యంత విశాలమైన ప్రాంతంలో అల్లు స్టూడియోను అల్లు ఫ్యామిలీ వారు నిర్మించిన విషయం తెలిసిందే. ఇక ఎట్టకేలకు అక్టోబర్ ఒకటవ తేదీన అల్లు రామలింగయ్య 100వ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేతుల మీదుగా ఈ స్టూడియోను ప్రారంభించారు. ఇక చిరంజీవితోపాటు అల్లు కుటుంబ సభ్యులు హైదరాబాదులో కొత్త ఫిలిం స్టూడియో.. అల్లు స్టూడియోస్ ప్రారంభించడం అందరికీ హర్షదాయకమని చెప్పాలి. ముఖ్యంగా ఈ వేడుకకు ఆలీ , త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పాటు చాలామంది సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. అల్లు అర్జున్, అల్లు అరవింద్ , సురేఖ అల్లు స్నేహారెడ్డి , అల్లు శిరీష్, చిరంజీవి ఇలా తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.


ఇకపోతే ఈ కార్యక్రమంలో భాగంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. ముందుగా మెగాస్టార్ చిరంజీవి గారికి నా తరఫున , అల్లు కుటుంబం తరఫున కృతజ్ఞతలు..ఇక అందరూ అనుకోవచ్చు అల్లు అరవింద్ గారికి గీతా ఆర్ట్స్ బ్యానర్ ఉంది.. వాళ్ళకి పెద్ద ల్యాండ్ ఉండి ఉంటుంది.. ఇక వాళ్లకి స్టూడియో పెట్టడం పెద్ద విశేషం కాకపోవచ్చు అని, కానీ ఈ స్టూడియో పెట్టిన పర్పస్.. మాకు ఏదో కమర్షియల్ గా వర్క్ అవుట్ అవుతుందని కాదు.. ఈ స్టూడియో పెట్టడానికి కారణం మా తాతయ్య గారి కోరిక అంటూ అల్లు అర్జున్ తెలిపారు. ఆయన జ్ఞాపకం గానే ఈ స్టూడియోను నిర్మించడం జరిగింది. ఇక ఇక్కడ మంచి మంచి సినిమాలు షూటింగ్ జరగాలని కోరుకుంటున్నట్లు అల్లు అర్జున్ తెలిపారు.

మామూలుగా తండ్రి చనిపోతే కొడుకులు కొన్ని సంవత్సరాలు పాటు పూజ చేస్తారు .. రోజులు మారే కొద్ది చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ కూడా తగ్గుతూ ఉంటుంది .. కానీ మా నాన్నగారు సంవత్సరాలు గడుస్తున్నా.. ఇంకా ఇంకా గ్రాండ్గా వారి నాన్న ఫంక్షన్ సెలబ్రేట్ చేస్తున్నారు ఇక మా నాన్నగారు వాళ్ళ నాన్నగారిని ఎంతలా ప్రేమిస్తున్నారో చూస్తూ ఉంటే నాకు కూడా ముచ్చట వేస్తుంది.. ఇక వాళ్ల నాన్నను అంతగా ప్రేమించే మా నాన్నకు అభినందనలు. ఇక అలాగే కొన్ని దశాబ్దాలుగా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న మెగా అభిమానులకు, నన్ను ప్రేమించే నా అభిమానులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అంటూ అల్లు అర్జున్ తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news