ఏపీలో తెలంగాణ నేతలు..రివర్స్ స్ట్రాటజీ..!

-

రాజకీయాల్లో ప్రత్యర్ధి పార్టీల మధ్య రాజకీయ యుద్ధం కామన్‌గా జరుగుతుంది..ఏ పార్టీకి ఆ పార్టీ పైచేయి సాధించాలని రాజకీయం చేస్తాయి. అయితే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఈ విమర్శలని ప్రజలు ఎంతవరకు నమ్ముతారో చెప్పలేం. అలా కాకుండా వేరే పార్టీల వారు..న్యూట్రల్ ముసుగులో రాజకీయం చేసేవారు ఒక పార్టీ గురించి విమర్శలు చేస్తే..అది ప్రజలకు ఎక్కువగానే రీచ్ అవుతుంది.

గత ఎన్నికల్లో ఈ ఫార్ములాని వైసీపీ బాగా వర్కౌట్ చేసింది. న్యూట్రల్ ముసుగులో కొందరు రాజకీయ మేధావులు..టీడీపీని గట్టిగా టార్గెట్ చేసి విమర్శలు చేశారు. అలాగే పక్కనే ఉన్న తెలంగాణలోని టీఆర్ఎస్ నాయకులు సైతం పరోక్షంగా వైసీపీకి సహకరిస్తూ..టీడీపీని నెగిటివ్ చేసుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలు టీడీపీకి బాగానే మైనస్ అయ్యాయి. మొత్తానికి అన్నీ నెగిటివ్‌లు కలిసి టీడీపీకి పెద్ద నెగిటివ్ అయ్యి..ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది.

అయితే ఇప్పుడు అదే ఫార్ములా ఏపీ రాజకీయాల్లో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. కాకపోతే ఈ సారి టీడీపీకి మద్ధతుగా వైసీపీకి యాంటీగా రాజకీయం నడుస్తోంది. ఏపీకి సంబంధించిన కొన్ని అంశాలపై తెలంగాణ నేతలు స్పందిస్తున్నారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్…కొన్ని సమస్యల విషయంలో వైసీపీని టార్గెట్ చేసి విమర్శిస్తుంది. అలాగే ఏపీతో పోల్చి తెలంగాణలో రోడ్లు, కరెంట్, అభివృద్ధి ఇంకా ఇతర అంశాల్లో అద్భుతంగా నడుస్తున్నాయని చెబుతున్నారు. ఇది ఖచ్చితంగా వైసీపీకి మైనస్ అవుతుంది.

ఇక ఆ మధ్య భువనేశ్వరిపై కొందరు వైసీపీ నేతలు దారుణంగా మాట్లాడారు. దీనిపై కొందరు తెలంగాణ నేతలు వైసీపీపై విరుచుకుపడ్డారు. ఇప్పుడు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుని కూడా తప్పుబడుతున్నారు. ఈ పరిణామాలు చాలావరకు వైసీపీకి యాంటీగానే నడుస్తున్నాయి. మరి ఇవి ఎంతవరకు వైసీపీకి డ్యామేజ్ చేస్తాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news