బ్రహ్మిని కలిసి బన్ని..!

-

హాస్య బ్రహ్మ బ్రహ్మానందం ఈమధ్యనే హార్ట్ సర్జరీ చేయించుకున్నాడని తెలిసిందే. లాస్ట్ మంత్ ముంబై హాస్పిటల్ లో బ్రహ్మికి బైపాస్ సర్జరీ జరుగగా ఆయన ఆయోగ్యం గురించి అటు అభిమానులు, సినిమా సెలబ్రిటీస్ కాస్త టెన్షన్ పడ్డారు. ఫైనల్ గా ఆయన మళ్లీ మాములు మనిషి కాబోతున్నారు. అయితే బ్రహ్మానందం ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు హీరోలు ఫోన్ లో టచ్ లో ఉండగా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మాత్రం డైరెక్ట్ గా బ్రహ్మానందంను వెళ్లి కలిశాడు.

బ్రహ్మానందం నిజంగా గట్టి మనిషి.. ఆయన గుండె చాలా గట్టిది.. ఫన్నీ అండ్ ఫియర్లెస్.. మా కిల్ బిల్ పాండే గుండె వ్యాధిని చంపేయడం చాలా సంతోషంగా ఉందని బ్రహ్మితో సరదాగా దిగిన పిక్ ను షేర్ చేస్తూ ట్వీట్ చేశాడు బన్ని. బ్రహ్మానందం ఇంటికి వెళ్లి బన్ని పలుకరించి వచ్చారట. ప్రస్తుతం బ్రహ్మితో బన్ని దిగిన పిక్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news