చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా తెలుగు ఇండస్ట్రీలో విషాదం అలుముకుంది.
ప్రముఖ డాన్స్ షో అయినా ఢీ షో కొరియోగ్రాఫర్ గా రాణిస్తున్న డ్యాన్స్ మాస్టర్ చైతన్య ఆత్మహ*కు పాల్పడ్డాడు. నెల్లూరులోని క్లబ్ హోటలలో అతను హ్యాంగ్ చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ మేరకు ఆత్మహత్య కు ముందు రికార్డు చేసిన సెల్ఫీ వీడియో బయటకు వచ్చింది. తనకు చాలా అప్పులు ఉన్నాయని, ఏం చేయాలో ఎలా తీర్చాలో అర్థం కావడం లేదని చైతన్య ఆ వీడియో లో పేర్కొన్నాడు. ఈ పని చేస్తున్నందుకు తన తల్లిదండ్రులకు, తన తోటి డ్యాన్స్ మాస్టర్లకు, డ్యాన్సర్ల కు స్వారీ చెప్పాడు చైతన్య. అప్పులు ఇచ్చిన వాళ్లు చేసే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నానని, మరో దారి లేక ఇలా చేస్తున్నానని తెలిపాడు. కాగా ఇతని మృతిపట్ల సినీ ప్రముఖులు, సన్నిహితులు సంతాపం తెలుపుతున్నారు.