ఎక్కడో చైనాలో పుట్టి మనుషులను పిట్టల్లా రాలుస్తోంది కరోనా వైరస్. అది ప్రపంచ దేశాలకు విస్తరించి మానవాళిని గడగడలాడిస్తోంది. ప్రస్తుతం భారతేదశంలోని విస్తరించింది. తెలంగాణలోనూ పలువురికి కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. కేసీఆర్ ప్రభుత్వం అనేక కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. దాదాపు మూడుగంటల పాటు ఉన్నత స్థాయి సమీక్షల అనంతరం సంచలన నిర్ణయాలు తీసుకుంది.
మార్చి 31 వరకు రాష్ట్రంలోని జన సంచారం ఉండే ప్రదేశాలను మూసి వేసింది. అందులో భాగంగా విద్యా సంస్థలు, మాల్స్, థియేటర్స్, పబ్స్, క్లబ్స్ వంటి వాటిని పూర్తిగా మూసి వేయాలని ఆదేశాలు జారీ చేసింది. కరోనా కట్డడినే ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నామని, అందరూ సహకరించాలని కోరింది. ప్రభుత్వత నిర్ణయాలకు మద్దతిస్తూ చిరంజీవి ఓ ప్రకటన చేశాడు.
కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు తోడుగా ప్రజా సహకారం అవసరమని మెగాస్టార్ చిరంజీవి పేర్కొన్నాడు. తన సినిమా షూటింగ్‌ను 10, 15 రోజుల వరకు వాయిదా వేస్తున్నామని ప్రకటించారు. ఏపీ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటోంది, మరింత అప్రమత్తత అవసరమని అన్నాడు.