Chiranjeevi: RRR అడ్వాంటేజ్.. ‘ఆచార్య’ హిందీ రిలీజ్.. క్లారిటీ ఇవ్వనున్న మేకర్స్

-

ప్రజెంట్ సినిమా రిలీజెస్ పాన్ ఇండియా వైడ్ గా జరుగుతున్నాయి. ఇది ఒక ట్రెండ్ లాగా సాగుతున్నది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల చిత్రాలు దేశవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. తద్వారా భవిష్యత్తులో భారత సినీపరిశ్రమ ఒక్కటిగా ముందుకు సాగే అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్టార్ హీరోల తెలుగు సినిమాలన్నీ దాదాపుగా దేశవ్యాప్తంగా విడుదలవుతున్నాయి. ఈ క్రమంలోనే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘ఆచార్య’ చిత్రం గురించి నెట్టింట డిస్కషన్ జరుగుతున్నది.

చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ పిక్చర్ తర్వాత చేస్తు్న్న సినిమా ‘ఆచార్య’. ఇందులో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘సిద్ధ’ అనే ఫుల్ లెంగ్త్ రోల్ ప్లే చేశారు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం బాలీవుడ్ లోనూ విడుదల కాబోతుందని వార్తలొస్తున్నాయి. RRR సినిమాతో బాలీవుడ్ లో రామ్ చరణ్ క్రేజ్ ఉన్న క్రమంలో ‘ఆచార్య’ కూ అడ్వాంటేజ్ అవుతుందని ఈ సందర్భంగా పలువురు అభిప్రాయపడుతున్నారు.

మ్యాట్నీ ఎంటర్ టైన్‌ మెంట్స్, కొణిదెల ప్రొడక్షన్స్ సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ ఫిల్మ్ వచ్చే నెల 29న విడుదల కానుంది. త్వరలో ఈ చిత్ర ప్రమోషన్స్ కూడ స్టార్ట్ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆచార్యుడి సందడి బాలీవుడ్ లో ఉండబోతున్నదని అంటున్నారు. కాగా, ఈ విషయమై మూవీ మేకర్స్ మాత్రం స్పష్టతనివ్వడం లేదు. త్వరలో ఈ విషయంపై ప్రకటన వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. చూడాలి మరి.. మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’గా బాలీవుడ్ లోనూ సందడి చేస్తారా? లేదా టాలీవుడ్ కే పరిమితమవుతారా..

Read more RELATED
Recommended to you

Latest news