పెళ్లిలో కలుసుకున్న మెగా బ్రదర్స్‌.. ఫోటోలు వైరల్

టాలీవుడ్ స్టార్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ నిన్న ఓ పెళ్లి వేడుకలో కలిసి అందరిని కనువిందు చేశారు. మాజీ మంత్రి బుద్ధ ప్రసాద్ కుమారుడు వెంకటరామ్ మ్యారేజ్ రిసెప్షన్ హైదరాబాద్ లోనీ ఓ ప్రముఖ ఫంక్షన్ హాల్ లో జరిగింది. అయితే ఈ మ్యారేజ్ రిసెప్షన్ కు మెగాస్టార్ చిరంజీవి మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇద్దరు వచ్చారు.

ఈ సమయంలో ఈ మెగా బ్రదర్స్ నవ్వుతూ పలకరించి ఉన్నారు. ఇక ఆటో మెగా బ్రదర్స్ రాకతో పెళ్లి ఫంక్షన్ లో కొత్త ఉత్సాహం నెలకొంది. అనంతరం మెగా బ్రదర్స్ ఇద్దరూ కలిసి వధూవరులు మరియు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఫోటోలు దిగారు. అయితే అంతకు ముందు పవన్ కళ్యాన్… తన అన్నయ్య చిరంజీవి చేతిలో చేయి వేసి నవ్వుతూ ఫోటోలు దిగారు. అయితే… చిరంజీవి మరియు పవన్ కళ్యాణ్ దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్… భీమ్లా నాయక్ సినిమా చేస్తుండగా. … మెగాస్టార్ చిరంజీవి ఆచార్య సినిమా లో బిజీ అయిపోయారు.