అమిత్ షాతో చిరంజీవి, రాంచరణ్ భేటీ

 

అర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాట ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డును సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ విజయం పై ఇప్పటివరకు ప్రతి ఒక్కరు స్పందిం చారు. సినిమా ప్రియుల నుంచి ప్రధాని వరకు అందరూ స్పందించారు.

ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా కేంద్ర హొం మంత్రి అమిత్ షాతో చిరంజీవి, రాంచరణ్ భేటీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర హొం మంత్రి అమిత్‌ షానే తెలుగు ట్వీట్‌ చేశారు. భారతీయ చిత్రసీమలో ఇద్దరు దిగ్గజాలు చిరంజీవి మరియు రామ్‌ చరణ్‌ లను కలవడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా అమిత్‌ షా ట్వీట్‌ చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ భారతదేశ సంస్కృతి మరియు ఆర్థిక వ్యవస్థను గణనీయంగా ప్రభావితం చేసిందన్నారు. నాటు-నాటు పాటకు ఆస్కార్ మరియు RRR చిత్రం అద్భుత విజయం సాధించినందుకు రాంచరణ్ ను అభినందించారని తెలిపారు.