మెగాస్టార్ చిరంజీవి బీజేపీలో చేరుతున్నట్లు నిన్నటి నుంచి రూమర్లు గుప్పుమంటోన్న సంగతి తెలిసిందే. పార్టీ అదిష్టానం ఇచ్చిన ఆఫర్ కు చిరు ప్లాటై పోయారని, రాష్ర్టంలో బీజేపీ పార్టీ కీలక బాద్యతలతో పాటు, రాజ్యసభలో బెర్త్ కన్ఫమ్ చేసినట్లు రూమర్లు ఓ రేంజ్ లో స్వైర విహారం చేస్తున్నాయి. అయితే ఈ వార్తలను మెగా కాంపౌండర్ వర్గాలు ఖండించాయి. చిరు మళ్లీ రాజకీయాలు చేయడం ఏంటి? హస్యాస్పదంగా ఉందంటూ ఆయన సన్నిహిత వర్గాలు కొట్టిపారేసాయి. ప్రస్తుతం ఆయన సినిమాలు తప్ప మరో ప్రపంచం వైపు చూసే అవకాశం ఏ మాత్రం లేదని వెల్లడించాయి.
అయినా చిరు కొన్నేళ్ల నుంచి రాజకీయాలకు దూరంగా ఉంటోన్న సంగతి తెలిసిందే. ప్రజారాజ్యం పార్టీ విలీనం అనంతరం కొన్నాళ్ల పాటు కాంగ్రెస్ లో కొనసాగినా ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రాజకీయాల పట్ల ఆయన ఆనాసక్తి బయటపడింది. అటుపై తమ్మడు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ తరుపున ప్రజల్లో తిరిగినప్పుడు గానీ, ఎన్నికల సమయంలోగానీ, పార్టీకి మద్దతిస్తున్నట్లు గానీ ఏ సందర్భంలోనూ వెల్లడించింది లేదు. పవన్ పని పవన్ దే…తన పని తనదే అన్నట్లు వ్యవరించారు. తమ్ముడు పార్టీ విషయంలోనే చిరు అంత క్లారిటీగా ఉన్నప్పుడు ఏపీ, తెలంగాణల్లో పట్టు లేని బీజేపీ పార్టీని ఆయన ఎందుకు పట్టుకుంటాడని జోస్యం చెబుతున్నారు.
ఒకవేళ చిరుకు రాజకీయాలంటే? అంత ఆసక్తి ఉంటే జనసేన పార్టీలోనే చేరే వారని పేర్కొన్నారు. ఇవన్నీ కేవలం రేటింగ్ లకు కోసం చేసే స్పెక్యులేషన్స్ మాత్రమేనని మెగా కాపౌండ్ వర్గం భగ్గుమంది. అదీ చిరు బిజేపీ ఎంట్రీ వెనుక కథ. ప్రస్తుతం చిరంజీవి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఇటీవలే సినిమా చిత్రీకరణ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం చిరు సహా టీమ్ అంతా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమయ్యారు.