కొరటాల సినిమాలో చిరంజీవికి విల‌న్‌గా స్టార్‌ హీరో..!!

`సైరా` సినిమాతో విజయం అందుకున్న మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివతో ఓ సినిమాను పట్టాలెక్కించిన సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాలో చిరంజీవి ఓ ప్రభుత్వ ఉద్యోగిగా కనిపించబోతున్నారట. దేవాదాయ శాఖలో పనిచేసే ఎంప్లాయ్ పాత్రలో చిరంజీవి నటించబోతున్నారట. ఈ సినిమాకు గోవిందాచార్య అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. ఆగస్ట్ 22న చిరు బర్త్ డే కానుకగా సినిమా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు దర్శకుడు కొరటాల శివ. ఇదిలా ఉంటే చిరంజీవి, మోహ‌న్ బాబు చాలా సంవత్సరాల తరువాత ఈ సినిమాలో కలిసి నటించనున్నారన్నది ప్రస్తుతం ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్న మాట. వాస్త‌వానికి చిరంజీవి-మోహన్ బాబు ఈ ఇద్దరి పేర్లూ వింటేనే.. తెలుగు ప్రేక్షకులకు ఒకరకమైన ఫీలింగ్స్.

ఇద్దరూ స్నేహితులో.. శత్రువులో అర్థంకాని అయోమయం. ఆఫ్ స్క్రీన్ ఇద్దరి మధ్య దశాబ్దాలుగా ఇటువంటి అనుబంధమే కొనసాగుతోంది. టాలీవుడ్ కు ఇద్దరూ విలన్ గా పరిచయమై ఆపై స్టార్‌ హీరోలుగా మెప్పించిన నటులే. ఇద్దరూ కలిసి బిల్లా – రంగా, పట్నం వచ్చిన పతివ్రతలు వంటి చిత్రాల్లో హీరోలుగా కలిసి నటించారు. ఆపై చిరంజీవి సినిమాల్లో మోహన్ బాబు, విలన్ గా తనదైన విలక్షణ శైలిలో మెప్పించారు కూడా. అయితే మ‌రో సారి ఈ సినిమాలో చిరంజీవి విల‌న్‌గా న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తోంది. ఈ వార్తపై అధికారిక సమాచారమైతే ఇంతవరకూ వెలువడలేదుగానీ, అదే నిజమైతే, ఇద్దరి కాంబినేషన్ అదిరిపోతుందన్నది మాత్రం వాస్తవం.